DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు మళ్లీ పెడతాం: మంత్రి గుడివాడ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 09 , 2022 (డిఎన్ఎస్):*  మూడు రాజధానులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పునరుద్ఘా టించారు. దీనికి సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు గతంలో

రాజ ధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని, అయితే కోవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన తెలియజేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంనుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చు అని ఆయన తెలియజేశారు. శుక్రవారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తుంటే, దానిని అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నుంచి అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని, ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలపై

చేస్తున్న దండయాత్రగా భావిస్తున్నామని అమర్నాథ్ అన్నారు.  అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి గురించి చులకనగా,అవహేళనగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారు కూడా విశాఖ ప్రాంత

వ్యతిరేకులుగా భావించవలసి వస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని,అభివృద్ధి అనేది అంతటా జరగాలని ఆలోచించి మూడు రాజధానుల ప్రకటన చేస్తే, దానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ  మినహా ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. అమరావతిలోని 29 గ్రామాలు మాత్రమే

అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదన్న భావనతోనే ఈ సభను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతోందని అన్నారు.  అమరావతి వద్దు అని చెప్పలేదు., అమరావతిని కూడా కలుపుకొని మూడురాజధానులు చేసి చూపిస్తామని, అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక

ఆధారంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అడుగుముందుకు వేస్తుంటే దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఒకటే రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక పోవడమే కాకుండా, అక్కడ రాజధాని నిర్మాణానికి లక్షా 10 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. ఇంత మొత్తం రాజధానికి ఖర్చు

పెట్టే కన్నా ఆ మొత్తంతో అనేక పథకాలను ప్రవేశపెట్టడానికి అవకాశం కలిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 15వేల కోట్లతో నాడు నేడు వంటి బృహత్తర కార్యక్రమం, ఆసుపత్రుల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. విశాఖకు రాజధాని వద్దని చెప్పి, మొదటి సారి విశాఖ వచ్చిన చంద్రబాబును

ఇక్కడి ప్రజలు ఎలా వెనక్కి పంపించారో అందరికీ తెలుసనీ అమర్నాథ్ అన్నారు. అయినా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేయడానికి వివిధ పార్టీల నాయకులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు సౌమ్యులు. అలా అని పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తే చూస్తూ ఊరుకోరని  ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్ అభివృద్ధికి తానే శంకుస్థాపన చేశానని చెప్పుకుంటూ పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్న చంద్రబాబును వదిలేస్తే చార్మినార్ కూడా తానే కట్టేననేని చెబుతాడని అన్నారు. హైదరాబాద్ను అంతగా అభివృద్ధి చేసి ఉంటే, ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు కనుమరుగు అయిందని అమర్నాథ్ ప్రశ్నించారు. హైటెక్ సిటీకి అప్పటి

ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం మాత్రమే చేశారని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ హెరిటేజ్ ఒక్కటేనని అమర్నాథ్ ఎద్దేవా

చేశారు. పేదవాడికి సైతం ఉన్నత విద్య, వైద్యం అందించాలన్న మంచి ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. అమరావతిలో పేదవారిని చంపి, ధనవంతులని బతికించాలన్న దురాలోచన కలిగిన చంద్రబాబు స్వలాభాలను ప్రజలు గమనిస్తున్నారని, అతనికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.సిపిఐ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ తులసి రెడ్డి

వంటి డస్ట్ బిన్ నేతలను పక్కన పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రసంగాలు చేస్తే చూస్తూ  ఊరుకోమని, యాత్రల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అమర్ నాథ్ హెచ్చరించారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే పాదయాత్రకు అనుమతులు నిరాకరించామని ఆయన తెలియజేశారు. ఒకప్పుడు అమరావతి దేవతల రాజధాని,

చంద్రబాబు నిర్మించాలనుకున్నది దెయ్యాల, రాక్షసుల రాజధాని అని అమర్ నాథ్ అన్నారు. బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు మూడు రాజధానులు గురించి చేసిన వ్యాఖ్యలపై అమర్ నాథ్ స్పందిస్తూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడాలని ఆయన అన్నారు. ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాల అనంతరం

భోగాపురం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam