DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనకు కేంద్రమంత్రి సానుకూలత

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 16 , 2022 (డిఎన్ఎస్):*  విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనకు స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు బీజేపీ రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నర్శింహారావు తెలిపారు. కేంద్ర ఉక్కు శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ను

ప్రత్యక్షంగా కలిసి సానుకూలంగా కోరిన అంశాలకు ఆయన నుంచి సానుకూల స్పందన లేఖ ద్వారా లభించిందన్నారు. ఇది నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వమిచ్చిన భరోసా అని తెలియచేసారు. 
విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు సమయంలో భూములు అందచేసిన నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన గురించి ఇటీవలే  జీవీఎల్ కేంద్రమంత్రి ని కలిసి స్టీల్ ప్లాంట్

నిర్మాణ సమయంలో భూమిని ఇచ్చిన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ నిమిత్తం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల కల్పనకు గాను RINL వాగ్దానం చేయడం జరిగింది అని, అటువంటి వారిలో 16,500 మందికి గాను ఇప్పటివరకు 8000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. 

RINLచే హామీ పొందిన మిగతా భూములు అందించిన కుటుంబాలు ఇప్పుడు ఉద్యోగాలు

అర్ధిస్తున్నయని, వాటి గురించి సావధానంగా పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకోమని కేంద్ర మంత్రి ని కోరిన నేపథ్యంలోఉక్కుశాఖ మంత్రి స్పందిస్తూ ఈ వినతిని తాను సానుకూలంగా పరిశీలించడం జరిగిందని, RINL తో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విషయాన్ని చర్చించడం జరిగిందన్నారు.  

RINL ఇరవైవేల ఉద్యోగాలలో 5,000 మందికి ఉద్యోగాలు

కల్పించడానికి హామీ ఇవ్వగా 31 ఆగస్టు 2022 కల్లా  ఇచ్చిన హామీకంటే ఎక్కువగా 8009 మందికి ఉద్యోగాలు కలిపించడం జరిగిందని,  ఇకపై ఇవ్వదలచిన  ఉద్యోగాల్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు జూనియర్ ట్రైనీ వంటి అనుభవం అవసరం లేని స్థానాలకు 50% ఉద్యోగాలు నిర్వాసితులకు ఇవ్వనున్నామని తెలిపారన్నారు.   

అంతేకాక RINL కు

సంబంధించిన మెయింటినెన్స్ కాంట్రాక్టులో తీసుకోవలసినటువంటి ఉద్యోగాల్లో 50 శాతం మంది ఉద్యోగాలు కేవలం నిర్వాసితులకు మాత్రమే అందజేస్తామని మంత్రి జీవీఎల్ కు స్వయంగా రాసిన లేఖలో భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జీవీఎల్ స్పందిస్తూ వెంటనే తన విన్నపముపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హామీ

ఇప్పటికీ ఉపాధి ప్రయోజనం పొందని వేలాది మంది నిర్వాసితులకు భారీ ఉపశమనం మరియు సహాయక చర్యగా ఉంటుందని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు యొక్క సమస్యల పరిష్కారానికి తను మరింత కృషి చేస్తానని తెలియజేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam