DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా కార్యకర్త నుంచి అధ్యక్షురాలు వరకూ విజయ ప్రస్థానం. 

విశాఖపట్నం, ఆగస్టు 13 , 2018  (DNS  Online ): à°’à°• మహిళా కార్యకర్త స్థాయి నుంచి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి స్థాయి వరకూ చేరడం వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, ప్రజా అభిమానం సంపాదించిన

ఘనత తోట విజయలక్ష్మిదే. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమెకు à°ˆ  à°¨à°¿à°¯à°¾à°®à°•à°‚ సునాయాసంగా మాత్రం లభించలేదు అనేది వాస్తవం.

ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ,  à°ªà±à°°à°œà°¾ సేవ చేసేందుకు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా త్యజించి, ప్రజాక్షేత్రం లోకి

అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు విజయలక్ష్మి. అనంతరం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ కుతంత్రంలో ఆమె కు నమ్మక ద్రోహం సైతం చేసిన

ఘటనలూ ఉన్నాయి. అనంతరం ఆమె భారతీయ జనతా పార్టీ లో సామాన్య కార్యకర్త గా చేరి ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలతో మమేకమై,

రైతాంగానికి, మహిళలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతర కాలంలో ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను పరిశీలించిన బీజేపీ అధినాయకత్వం ఆమెకు రైతు

మోర్చాలో జాతీయ స్థాయి లో పదవి ఇచ్చేందుకు ఆహ్వానం పలికింది. ఇలాంటి అవకాశం మరెవ్వరికైనా సరే వచ్చి ఉంటే ( బీజేపీ అయినా, మరే పార్టీ అయినా సరే) ఎగిరి

గెంతులేసుకుంటూ పదవి అందుకునేవారు. అయితే ప్రజాసేవ కోసమే ఎన్నో త్యాగాలు చేసిన విజయలక్ష్మి తనకు జిల్లా అధ్యక్ష పదవి మాత్రం ఇస్తే చాలు అని అధిష్టానానికి

తెలిపారు. గత రెండేళ్లుగా బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా చేసిన సేవలకు గుర్తింపు ఇస్తూ తోట విజయలక్ష్మి ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా

అధ్యక్షురాలిగా నియమించారు. à°ˆ సందర్భంగా ఆమె రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తదితరులకు ధన్యవాదములు తెలియచేసారు. 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live  #dnsmedia #dns media #vizag  #visakhapatnam  #visakha news  #vizag news 

#bjp  #bharatiya janata party  #thota vijayalakshmi  #vijaya lakshmi  #mahila morcha  #president

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam