DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యూనివర్సిటీ పేరు మారితే. .విద్యార్థుల బ్రతుకు అధోగతే..:వైద్య విద్యార్థులు

*మార్కు లిస్ట్ ఒక వర్శిటీ పేరుతో, డాక్టర్ డిగ్రీ ఇంకొ వర్శిటీ పేరుతొ ఉంటె  ఫేక్ అనరా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2022 (డిఎన్ఎస్):* ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వేలాదిమంది వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడనుంది. ఇప్పడి వరకూ ఎన్ టి

ఆర్ వైద్య విద్యాలయం పేరుతొ ఉన్న సంస్థ లో చదువుతున్న వైద్య విద్యార్థులకు మార్కు లిస్ట్ ఇదే పేరు తో వస్తుంది. ఇక పై పేరు మారితే ఆఖరి సంవత్సరం చివరన డాక్టర్ డిగ్రీ వైఎస్సార్ పేరుతొ వస్తుంది. వీళ్లంతా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళ సర్టిఫికెట్ లు వెరిఫికేషన్ జరుగుతుంది. విదేశీయులు ఇక్కడ వెరిఫికేషన్

కి వస్తే. . .మార్క్ లిస్ట్ పై ఉన్న ఎన్ టి ఆర్ పేరు చూస్తారు. ఇక్కడ ఆ పేరుతొ విద్య సంస్థ ఉండదు. దీంతో విద్యార్థి కి విదేశాల్లో చదివే అవకాశం ఆ దేశాలవాళ్ళు తిరస్కరిస్తారు.
ఇప్పడి వరకూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొదటి సెమిస్టర్ మార్కు లిస్ట్ పై ఎన్టీఆర్ పేరు ఉంటుంది. ఇక నుంచి మరో పేరు ఉంటె. . .వీడు రెండు చోట్ల

 చదివినట్టు అనుమానం ఎవరి కైనా వస్తుంది. 

రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు, పారా మెడికల్ విద్య, నర్సింగ్, డెంటల్, ఆయుర్వేద, హోమియో తదితర అన్ని వైద్య కళాశాలలు ఈ ఎన్ టి ఆర్ వైద్య విద్యాలయం పరిధిలోనే ఉన్నాయి. ప్రతి ఏటా వెలది మంది విద్యార్థులు కళాశాలల నుంచి డిగ్రీలు పుచుకుని విడుదల అవుతున్నారు.

 

ఈ పేరు మార్పు జరిగినట్టు వెలది మంది విద్యార్థులకు ప్రభుత్వం లేఖలు ఇస్తుందా ? ఎంతమందికి ఇలా లేఖ తీసుకోవాలి అని తెలుస్తుంది. ఒక అసంబద్ధ నిర్ణయం తో వేలాదిమంది వైద్య విద్యార్థుల జీవితాలు బుగ్గి పాలు కాకముందే ఈ పెనుమార్పు జీవో ను రద్దు చెయ్యాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మా ఆసుపత్రులకు

కేటాయించిన రూ. 400 కోట్లు నిధులు వేరే స్కీం ల కోసం వెనక్కి తీసేసుకున్నారు. ఆసుపత్రుల్లో ఒక్క సదుపాయం చెయ్యలేదు, అయినా కూడా మెం ప్రజలకు వైద్య సేవ అందిస్తున్నామని, దానికి బహుమానంగా ప్రభుత్వం వైద్య విద్యాలయం పేరు మార్చిందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పేరు మార్పు రాజకీయ పరమైన అంశం కాదని, వెలది

మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam