DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి వేడుకలలో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు

*శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం*

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి  సెప్టెంబర్ 26, 2022 (డీఎన్ఎస్) :* ఇంద్ర‌కీలాద్రి, విజ‌య‌వాడ‌:- క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ హ‌రిచంద‌న్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్లను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ద‌ర్శించుకున్నారు.  ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు ఆల‌య ఈఓ ద‌ర్భ‌ముళ్ళ భ్ర‌మరాంబ ఆల‌య

మ‌ర్యాద‌ల‌తో మంగ‌ళ‌వాయిద్యాల‌తో వేద‌మంత్రాల న‌డుమ‌ పూర్ణ‌కుంభం స్వాగ‌తం ప‌లికారు. ఈ క్ర‌మంలో శ్రీ స్వర్ణ‌క‌వ‌చాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గే దుర్గతి నాశ‌ని, అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే

దారిద్ర‌ములు తొలగిపోయి స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌న్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర దేవదాయ ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో

రోజుకొక ప్రత్యేక అలంకారంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ( ఈ నెల 26 ) నుంచి ఆశ్వీయుజ శుద్ధ దశమి ( అక్టోబర్ 5 ) వరకూ అలంకారాల్లో భక్తులను కరుణించనుంది.

దసరా నవరాత్రి ఉత్సవాల్లో అలంకారాలు:

తేది: 26-09-2022 : సోమవారము: ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి: శ్రీ స్వర్ణ కవచాలంకృత

దుర్గాదేవి
తేది: 27-09-2022 : మంగళవారం: ఆశ్వీయుజ శుద్ధ విదియ :  శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి   
తేది: 28-09-2022 : బుధ వారం  ఆశ్వీయుజ శుద్ధ తదియ : శ్రీ గాయత్రీ దేవి
తేదీ 29-09-2022   :గురువారం : ఆశ్వీయుజ శుద్ధ చవితి   : అన్నపూర్ణ దేవి
తేదీ 30-09-2022 : శుక్రవారం : ఆశ్వీయుజ శుద్ధ పంచమి  : శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి
తేదీ 01-10-2022 :

శనివారం : ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి : శ్రీ మహాలక్ష్మీ దేవి
తేదీ 02-10-2022 : ఆది వారం : ఆశ్వీయుజ శుద్ధ సప్తమి : శ్రీ సరస్వతీదేవి (మూలానక్షత్రం)
తేదీ 03-10-2022 : సోమవారము : ఆశ్వీయుజ శుద్ధ అష్టమి : శ్రీ దుర్గాదేవి
తేదీ 04-10-2022 : మంగళవారం : ఆశ్వీయుజ శుద్ధ నవమి : శ్రీ మహిషాసురమర్దినీ దీవి
తేదీ 05-10-2022 : బుధ వారం : ఆశ్వీయుజ శుద్ధ దశమి : శ్రీ

రాజరాజేశ్వరి దీవి

భువనేశ్వరిపీఠంలో దేవినవరాత్రి మహోత్సవాలు

దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భువనేశ్వరిపీఠంలో అమ్మ వారు స్వర్ణకవచాలంకృత భువనేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. నేడు జరిగిన కార్యక్రమంలో విఘేశ్వర పూజ, పుణ్యహవచనము, రక్షాబంధనం, అఖండ దీపారాధన, అంకురారోపణ,కలశ స్థాపన, మండప ఆరాధనలు,

అమ్మవారికి అభిషేకము, సహస్రనామ కుంకుమపూజ, చండి పారాయణం, అయ్యవారికి అభిషేకము,చండీ పారాయణ, చండి హోమము, అమ్మవారికి నీరాజనమంత్రపుష్పములు, దర్భారు సేవ తో ఈ రోజు కార్యక్రమము పూర్తి అయ్యినది.21 సంవత్సరాలుగా ఈ దేవి నవరాత్రులు నిర్వహించుచున్నామని తెలిపారు. కరోనా వల్ల పరోక్షంగానే చండి పూజాది హోమాలు జరుగుతాయని తెలిపారు.

నేరుగా మరియు పరోక్ష పూజలలో పాల్గొను భక్తులు 9866193557, 9989088557 ఈ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam