DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్ర MLC సీటు వామ పక్షాల ఖాతాలో పడినట్టేనని తెలుస్తోంది

*వైకాపా, టిడిపి, బీజేపీ ల బలహీన అభ్యర్థులే వీళ్ళ కు మరింత బలమా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, అక్టోబర్ 07 , 2022 (డిఎన్ఎస్):*   త్వరలో జరుగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికలో వామపక్షాల అభ్యర్థి డా. koredla రమా ప్రభ ఎన్నిక నల్లేరు మీద నడక లాగానే మారింది.

అధికార, ప్రతిపక్ష పార్టీలు బలహీనమైన అభ్యర్థులను ప్రకటించడంతో వామపక్ష శిబిరం లో సంబర వాతావరణం నెలకొంది. గ్రామా స్థాయిలో ఉద్యమాలు చేసిన నేపధ్యం కల్గిన డా. రమాదేవి ఇటు ఉద్యోగులు, అటు సామాన్యులు సమస్యలను పూర్తిగా అవలోకనం చేసుకుని ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశం. ఈమెకు ఉద్యోగ సంఘాలు, వామపక్షాల కూటమి మొత్తం మద్దతు

ప్రకటించింది. 
ఇక ఇతర పార్టీలను పరిశీలిస్తే ఆయా పార్టీలు నిలబెడుతున్న అభ్యర్థులు బలహీనమైన వాళ్ళు కావడం గమనార్హం.  పైగా గతంలో ఇదే స్థానం నుంచి ఎం వి ఎస్ శర్మ రెండు సార్లు ఇదే కూటమి నుంచి ఎన్నికయ్యారు 

బిజెపి:
సిట్టింగ్ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ భారతీయ జనతా పార్టీ నుంచి మరోసారి బరిలో నిలబడే

అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇతను తెలుగుదేశం పార్టీ మద్దతు తో బరిలో నిలిచినా విషయం తెలిసిందే. ఈ సారూ తెలుగుదేశం సొంతంగా ఒక అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. గత ఆరేళ్లుగా ఇతను చేసిన ఘనకార్యం ఒక్కటి కూడా లేకపోవడంతో పాటు, సభలో కూడా తన వాణీ పెద్దగా వినిపించిన దాఖలాలు లేవు. ఇక కేంద్ర ప్రభుత్వం పరి తీవ్రమైన వ్యతిరేకత కూడా

ప్రజల్లో నెలకొని ఉండడం కూడా ఇతనికి ఓటమి మరింత దగ్గర చేస్తోంది.   

వైఎస్సార్ కాంగ్రెస్:

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి పేరుకూడా వాళ్ళ పార్టీలో క్యాడర్ కు తెలియక పోవడం బాగా కలిసి వచ్చే అంశం. పైగా ఇతను ఒక సామాజిక వర్గ కార్పొరేషన్ కు చైర్మన్ గా హోదా లో

ఉన్నారు. ఆ సామాజిక వర్గ ప్రజలను ఏనాడూ ఇతను కలిసిన పాపం పోలేదు. ఆ సామాజిక వర్గం కార్పొరేషన్ దాదాపుగా మూసేసి స్థితికి వచ్చేసింది. ఒక్క పధకం కూడా ప్రస్తుతం నడవడం లేదు. ఒక్కరికి కూడా ఈ కార్పొరేషన్ నుంచి ప్రత్యక్షంగా రూపాయి సాయం కూడా అందలేదు అని సంఘాలు బహిరంగంగానే గగ్గోలు పెడుతున్నాయి. ఇక గతంలో చైర్మన్ గా పనిచేసిన

వ్యక్తి ఈ కార్పొరేషన్ తో పాటు ఒక సహకార బ్యాంక్ ను కూడా ప్రారంభించడం, అది కొంచెం లాభాల్లో ఉండడంతో, , ఈ బ్యాంక్ కి లాభాలు తెచ్చిన ఘనత ఇతని అకౌంట్ లో వేసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఆ సామాజిక వర్గంలోని వారు మేధావులు కావడంతో ఈ దుర్భర పధకాన్ని త్రిప్పికొట్టారు. 
అదే సామజిక వర్గంలో గ్రాడ్యుయేట్లు అధికంగా ఉండడం

గమనార్హం. అయితే ఇతను జనం లో తిరిగిన మనిషి కాకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ తో కూడా సంబంధాలు పెద్దగా ఉన్నట్టు కనపడడం లేదు. 
పార్టీలోనే ఇతని పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రే వచ్చి చెప్పినా ఆ పార్టీ వాళ్ళే ఇతనికి ఓటు వేసే అవకాశం లేదని పార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. 

ఇట తెలుగుదేశం

పార్టీ తరపున భీమిలి కి చెందిన మహిళా అభ్యర్థిని బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించింది. ఈమె గురించి నగర వాసుల్లో గానీ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో గానీ పెద్ద గా తెలిసే అవకాశాలు లేకపోవడం తో ఎన్నిక కష్టతరంగా మారవచ్చు. 

ఈ సమీకరణాలు చూస్తే. . రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు వామ పక్షంతో కుమ్మక్కై బలహీనమైన

అభ్యర్థులను నిలబెట్టారా అనే అనుమానం కూడా రాకమానదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam