DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కామం తీర్చుకోడానికి పిల్లలని కనకండి : నన్నపనేని రాజకుమారి 

పిల్లలకు సత్ప్రవర్తన నేర్పాల్సింది తల్లిదండ్రులే : నన్నపనేని రాజకుమారి 

అనుకోని అతిధి చేసిన అద్భుత ప్రసంగం 

విశాఖపట్నం, ఆగస్టు 14 , 2018  (DNS  Online ):  à°•à°¾à°®à°‚

తీర్చుకోడానికి, ఒక క్షణం సుఖం కోసం చేసే తప్పు వలన వందలాది మంది చిన్నారులు ఆనాధలు గామారిపోతున్నారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని

రాజకుమారి మండిపడ్డారు. మంగళవారం నగరం లోని ఓ హోటల్ లో బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులు నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆమె అనుకోని అతిధి

గా విచ్చేసి అద్భుతమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమం జరుగుతోందని తెలిసి, తానూ తప్పని సరిగా ఈ కార్యక్రమం లో పాల్గొనాలని

భావించి వఛ్చినట్టు తెలిపారు. యువతీ యువకులు కామం తో కొట్టుకుని చేసీ చీకటి పనికి ఫలితంగా ఈ భూమిపైకి వస్తున్నా పసి పిల్లలను చెత్త బుట్టల్లోనూ, నడి రోడ్డుపైన,

ఎక్కడో వీధుల్లోనూ, ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశాల్లోనూ వదిలి పోవడం వల్ల వారికి భవిష్యత్ బుగ్గిపాలవుతున్నాయన్నారు. పిల్లలకు సత్ప్రవర్తన నేర్పించాల్సిన

భాద్యత తల్లిద్రండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులదే నని అన్నారు. ఇలా చిన్నారులను రోడ్డుపై వదిలి వెళ్లే తుచ్ఛుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పధకం అమలు

చేస్తోందన్నారు. ఊయల పేరిట ప్రారంభించిన ఈ పధకంలో ఒక గుడి దగ్గర, మసీదు దగ్గర, చర్చి దగ్గర ఒక చెట్టు దగ్గరలో ఒక ఊయల కట్టడం జరుగుతుందని తెలిపారు. ఇలా ఎవరూ తెలియని,

అభం శుభం తెలియని చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్చంద బాలల సంరక్షణ కేంద్రాల ప్రతినిధులకు ఆమె అభినందనలు తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రక్కదారి

పెట్టవద్దని, మీ సంరక్షణ లో ఉన్న చిన్నారులకు మంచి మార్గదర్శకం చేసి వారిని భారత దేశం మెచ్చే విధంగా మంచి పౌరులుగా తయారు చెయ్యాలి అని పిలుపునిచ్చారు. తమ మహిళా

కమిషన్ కు వస్తున్నా ఎన్నో ఫిర్యాదుల్లో ప్రధానమైన కేసులు చిన్నారులే బాధితులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #visakha news  #media  #nannapaneni  #rajakumari 

#andhra pradesh  #ap women commission  #chair person 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam