DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎమ్మెల్యే రాజీనామా ఫార్మాట్  ఏపీలో ఒకగా, తెలంగాణ లో ఇంకోలా ఉంటుందా?

*మూడు రాజధానుల కోసం చోడవరం ఎమ్మెల్యే రాజీనామా లేఖ విడుదల*

*తెలంగాణ ఫార్మాట్ ఆమోదం పొంది, ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. మరి ఏపీలో?* 

*(DNS ఇదీ రాజకీయం Report: BVS Ganesh Reddy, Reporter, Visakhapatnam)*    

*విశాఖపట్నం, అక్టోబర్ 08, 2022 (డిఎన్ఎస్):*   భారత దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన దేశంలోని ఏ చట్టసభ కు ఎన్నికైన వ్యక్తి

అయినా రాజీనామా చెయ్యాలి అంటే ఒకే తరహా ఫార్మాట్ ను ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో రాజాకీయ పార్టీలు ఆడుతున్న చదరంగంలో ప్రజలను పావులను చేస్తూ వివిధ రకాలుగా సినిమాలు చూపిస్తున్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు. దానిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన గంటకోసారి మెం మా పదవికి రాజీనామా

చేస్తాం అంటూ ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఒక రాజీనామా లేఖను సిద్ధం చేసి మీడియా కెమెరాల ముందు ప్రదర్శిస్తున్నారు. 
గతంలో రాష్ట్ర విభజన ఉద్యమం సమయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని చట్టసభల సభ్యులు రాజీనామా చేయడం జరిగింది. అదంతా నిజం కాబోలు అనుకున్న ప్రజలకు ఆ తర్వాత అసలు విషయం

తెలిసింది. 

ఒక చట్ట సభకు ఎన్నికైన వ్యక్తి రాజీనామా చెయ్యాలి అంటే ఆ లేఖలో కేవలం తాను చట్ట సభలో తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. అదనంగా మరొక్క అక్షరం వ్రాసిన ఆ లేఖ తిరస్కరించబడుతుంది. ఈ విషయం సభ్యులు, రాజకీయ పార్టీలు అందరికి తెలుసు. ప్రజల ముందు హైడ్రామా ఆడడం కోసం కొందరు

సభ్యులు తెగ సినిమా చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల కోసం అధికార పార్టీ, కేవలం అమరావతి కోసమే ప్రతిపక్షం రోడ్డెక్కి హంగామా చేస్తున్నాయి. దీనిలో భాగంగా శనివారం విశాఖ లో జరిగిన ఓ కార్యక్రమం లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తాను ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తున్న అంటూ ఓ లేఖను

మీడియా ముందు ప్రదర్శించారు. పైగా దానిలో మూడు రాజధానులు ఉండాలని, దాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది అంటూ కూడా వ్యయడం జరిగింది. నిబంధనల ప్రకారం ఈ లేఖ చెల్లదు అని నిపుణులు తెలియచేస్తున్నారు. 

గతం లో సైతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ( విశాఖపట్నం ఉత్తర

నియోజక వర్గం)  విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం రాజీనామా అంటూ ఓ లేఖను విడుదల చేసారు. దీన్ని అధికార పార్టీ అభ్యర్థులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. గంటా కు చిత్తశుద్ధి ఉంటె స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత గంటా ఒక లేఖలో తాను ఎమ్మెల్యే సీటు కు రాజీనామా చేస్తున్న అంటూ లేఖ స్పీకర్

కు పంపారు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. 

ప్రజల్లో సానుభూతి కోసం నేతలు పడుతున్న తాపత్రయం ప్రజలకు పూర్తిగా అర్ధం కావడంతో ధర్మశ్రీ లేఖ విడుదల చేసిన వెంటనే దాని తప్పు పడుతూ ప్రతిపక్ష నేతలు స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇవ్వాలని డిమాండ్ చేసారు. 

నేతలకు చిత్తశుద్ధి ఉంటె ప్రజలను మభ్యపెట్టకుండా తమ

నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. 

ఇదే తరహాలోనే తెలంగాణ లోని మునుగోడు కు చెందిన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి  తన ఎమ్మెల్యే సీటు కు రాజీనామా చేస్తున్నట్టు మాత్రమే లేఖలో వ్రాసి తెలంగాణ స్పీకర్ కు రాజీనామా లేఖ పంపారు. ఆ లేఖ లో అదనంగా మరొక అక్షరం కూడా వ్రాయలేదు. ఆ లేఖ వెంటనే ఆమోదం

పొందింది. ప్రస్తుతం అక్కడే ఉప ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. 

ఇదే విధంగా మూడు రాజధానుల కోసం రాజీనామా చెయ్యాలి అనుకున్న ఎమ్మెల్యే లు చిత్తశుద్ధి ఉంటె  కోమటిరెడ్డి తరహాలోనే ( స్పీకర్ ఫార్మాట్) లో రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam