DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ధర్మాన్ని కించపరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: విహెచ్పి

*హిందూ సమాజ బలోపేతం కోసం మరో కోటిమందితో భజరంగ్ దళ్ సైన్యం*   

*హిందూ గుళ్లను ప్రభుత్వ కబంద హస్తాల నుంచి బయటకు తెస్తాం.*

*గాడితప్పిన వారిని తిరిగి హిందూ స్వధర్మం లోకి తీసుకు వస్తున్నాం*

*విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహా కార్యదర్శి గుమ్మళ్ల  సత్యంజి హెచ్చరిక*  

*(DNS Report: Sairam CVS,

राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, అక్టోబర్ 21, 2022 (డిఎన్ఎస్):*  ఇటీవల కాలం లో హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, దేవీ దేవతలపై వ్యగ్యంగా చిత్రీకరిస్తూ సినిమాలు, టీవీ సీరియళ్లు తీస్తూ, కోట్లాదిమంది హిందూ సంప్రదాయపరునా మనోభావాలను దెబ్బతీస్తున్నచిత్ర బృందాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వ

హిందూ పరిషత్ జాతీయ కమిటీ సహా కార్యదర్శి గుమ్మళ్ల సత్యం హెచ్చరించారు. శుక్రవారం విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన సింహాచలం క్షేత్రం లో వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామిని దర్శించారు. ఆలయ దర్శనం ఎంతో మంచి అనుభూతిని కల్గించిందన్నారు. అనంతరం DNS మీడియా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో అయన వివిధ అంశాలపై

కుండబ్రద్దలు కొట్టినట్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఈ దేశంలో సెక్యూలర్ విధానం కేవలం హిందువులకు మాత్రమే అమలు చేస్తున్నారని, హిందూ దేవీదేవతలు ఎవరుపడితే వాడు నోటికి వచ్చిన దూషణ చెయ్యవచ్చని, వ్యంగ్యంగా వీడియోలు తీస్తున్న చట్టాలు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయన్నారు. వీటిని ప్రశ్నించిన హిందువుల పై

క్రిమినల్ కేసులు అక్రమంగా బనాయిస్తున్నారన్నారు. 

టీవీ డిబేట్లలో నోటికి వచ్చిన ప్రేలాపనతో హిందూ దేవీదేవతలు కించపరుస్తున్నారని, దానికి ధీటుగా వాళ్ళ మతసంప్రదాయాన్ని ప్రశిస్తే చంపేస్తామని హెచ్చరించి మరీ  తలా తీసేస్తున్నారని, దీనికి ఉదాహరణే మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో జరిగిన శర్ తాన్ సే

జూద  ఉద్యమం ద్వారా హిందూ వ్యతిరేక ఉగ్రవాదులు మరింతగా పెట్రేగిపోతున్నారన్నారు. 

కొత్తగా కోటి మంది బృందంతో భజరంగ్ దళ్ బలోపేతం :

హిందూ సమాజ బలోపేతం కోసం కొత్తగా కోటిమంది సభ్యులతో భజరంగ్ దళ్ నియామకాలు జరుపుతున్నామన్నారు. ప్రధానంగా విశ్వహిందూ పరిషత్ (VHP) అనుబంధ తన యువజన విభాగం భజరంగ్ దళ్ ద్వారా

యువతను హిందూ ధర్మం పట్ల ఉత్తేజితులను చేసి, సమాజ సేవతో పాటు, హిందూ ధర్మ ప్రచారాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు నవంబర్ 6, 2022 నుంచి హిత చింతక్ అభియాన్ మహోన్నత యజ్ఞం మొదలు పెట్టినట్టు తెలిపారు. 15-35 సంవత్సరాల మధ్య వయస్సు గల కోటి మంది యువతీ యువకులను ధర్మ ప్రచారం కోసం సంసిద్ధుల్ని చేస్తున్నట్టు తెలిపారు. ఇది ధార్మిక శక్తి

అన్నారు. పూర్తిగా భారతీయ చట్టాలకు లోబడి, హిందూ ధార్మిక ప్రచారానికి కృషి చేస్తుందన్నారు. ప్రధానంగా వ్యక్తిత్వ వికాసానికి శిక్షణ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ శిక్షణను ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు. 

ఈ శిక్షణా కార్యక్రమంలో చరిత్ర, ధర్మం (మతం), సంస్కృతి (సంస్కృతి), ఆత్మరక్షణ పద్ధతులు, యోగా మరియు క్రీడలపై

పాఠాలు ఉంటాయన్నారు 

హిందూ గుళ్లో హిందువులే పనిచేయాలి:

హిందూ దేవాలయాల్లో కేవలం హిందూ సంప్రదాయాన్ని పాటించేవారు మాత్రమే ఉద్యోగం చెయ్యాలని, అయితే నేడు వేలాదిగా హిందూ దేవాలయాలు, దేవాదాయ శాఖా పరిధిలోని సంస్థల్లో క్రైస్తవులు, ముస్లిం లు తదితర అన్యమతస్థులు వేలాదిగా ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.

హిందూ గుళ్లో ప్రతి నెలా జీతాలు తీసుకుంటూ... ఆ దేవీదేవతలు నమ్మకుండా, చర్చ్ లకు వెళ్లే దేవాదాయ శాఖా ఉద్యోగులు భారీ సంఖ్యలోనే ఉన్నారన్నారు. ఈ విషయం అందరికి తెలిసినా చర్యలు తీసుకోవాల్సిన దేవాదాయ శాఖా అధికారులు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయన్నారు. 

తక్షణం హిందూ గుళ్ళల్లో వివిధ హోదాల్లో పనిచేసే

అన్యమతస్తులు ఉద్యోగం వీడి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి, కచ్చితంగా హిందూ సంప్రదాయ తిలక ధారణ చెయ్యాలని, ఆలయాల్లో ప్రసాదం తప్పనిసరిగా తినాల్సిందేన్నారు. ఆలయ హుండీల్లో భక్తులు వేసే ముడుపులు వీళ్ళు జీతాలుగా తీసుకుంటున్నామని జ్ఞానం కూడా లేకుండా ఏళ్ళ తరబడి ఇక్కడే పాతుకు పోయారన్నారు. వీళ్ళకి అండగా

నిలిచినా దేవాదాయ శాఖా అధికారుల ను సైతం  వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 

ఇంటి దొంగల కారణంగానే వేలాదిగా హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, గుళ్ల పరిధిలోని దుకాణాలు కూడా కేవలం హిందువులకే అద్దెకు ఇవ్వాలని, కాంట్రాక్ట్ లు కూడా హిందూ వులకే ఇవ్వాలని డిమాండ్

చేసారు. 

మతమార్పిళ్లను అడ్డుకుంటాం:

ఇతర ప్రలోభాలకు లోనై. .హిందూ ధర్మాన్ని వీడి ఇతర మతాల్లోకి వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని తిరిగి స్వధర్మం లోకి తీసుకు వచ్చే ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టామన్నారు. సనాతన హిందూ ధర్మం విలువలను, వారికి తెలియచేసి, ఈ సమాజం నుంచి దూరమై వాళ్ళు కోల్పోయిన

మనశాంతిని తిరిగి పొందే విధంగా బృహత్తర కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. 

హిందూ పండగలకి కాలుష్యమా ? నీ బండి పొగవదలడం లేదా?

హిందూ ధర్మాన్ని విఛ్చిన్నం చేసేందుకు హిందూవ్యతిరేక శక్తులు ఈ దేశంలో పెట్రేగిపోతున్నాయన్నారు. దీనిలో భాగంగానే కేవలం హిందూ పండుగలకు మాత్రమే ప్రధానంగా దీపావళి, వినాయకచవితి,

దుర్గ నవరాత్రులు రోజుల్లో పర్యావరణ కాలుష్యాలు, వాతావరణ కాలుష్యాలు, జల కాలుష్యాలు వస్తున్నాయంటూ కుహనా వాదులు కోర్టు గుమ్మాలు తొక్కుతూ, విశృంఖల ప్రచారం చేస్తున్నారన్నారు. కేవలం హిందూ పండుగలను జరుపుకోకుండా ప్రజల్లో భయాందోళనలు కల్గించే వీళ్ళు ప్రతిరోజూ వినియోగించే వాళ్ళ బైక్ లు, కార్లు విడుదల చేస్తున్న కార్బన్

మోనాక్సయిడ్ పర్యావరణానికి మేలు చేస్తుందా అని ప్రశ్నించారు. 

గో హత్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవు..

హిందువులు అత్యంత పవిత్రంగా పూజించుకునే గొమాతలను ప్రతిరోజూ లక్షలాదిగా కబేళాల్లో హత్యచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అక్రమంగా తరలిస్తున్న గో సంపదను ప్రతి రోజు దేశవ్యాప్తంగా హిందూ

సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటూనే ఉన్నారని, ప్రభుత్వాలు కుతంత్రంతో వాళ్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాయన్నారు. ఈ ఆగడాలకు ఇకపై అడ్డుకట్ట వేసేందుకు చట్ట ప్రకారం గోమాత లకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. 

ఎంతో పవిత్రమైన రానున్న కార్తీక మాసం లో  ప్రతి హిందూ బంధువు శ్రద్దగా సంప్రదాయాలను పాటిస్తూ కార్తీక

దీపారాధన ప్రతి ఇంటివద్ద చెయ్యాలని పిలుపునిచ్చారు. హిందువు సంప్రదాయబద్దంగా ఉంటె. .మొత్తం ప్రపంచం ఆనందంగా, సుభిక్షంగా ఉంటుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam