DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలు లో కుమార సుబ్రహ్మణ్య షష్టి వేడుకలకు భారీ ఏర్పాట్లు  

సంతాన లేమికి పరిష్కారం, వైద్య శాస్త్రానికి అంతుచిక్కని మహత్యం. 

భక్తజన సంహాహంతో జాతరను తలపిస్తున్న గోలింగేశ్వర స్వామి ఆలయం

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి, నవంబర్ 28, 2022 (డిఎన్‌ఎస్‌): మార్గశిర శుద్ధ షష్టి పర్వదినోత్సవం సుబ్రహ్మణ్య షష్టి గా (నవంబర్ 29 ) ప్రఖ్యాతి గాంచింది. ఈ

పర్వదినోత్సవం పేరు తలవగానే తెలుగు రాష్ట్ర ప్రజలకు వెంటనే స్ఫురణకు వచ్చే పేరు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం లోని అత్యంత పురాతనమైన గోలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలోనే వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి అత్యంత వైభవంగా మంగళవారం ( నవంబర్ 29 ) తెల్లవారుఝాము నుంచే అత్యంత వైభవంగా ఆరాధనలు జరుగుతున్నాయి.

దీనికై దేవాదాయ శాఖా, రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. 

శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవములు అనపర్తి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, షష్ఠి  ఉత్సవ కమిటీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి, ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు భక్తులు సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా

నిర్వహించబడుతోంది. 

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో సోమవారం నుంచే ఈ ప్రాంతం భక్తజనం తో కిటకిటలాడుతోంది. ఈ ఆలయం స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే ప్రతిష్ఠ చేసినట్టుగా పురాణం కధనం. ఈ ఆలయంలోనే  ఆయన ప్రతినిధిగా ఒక వృద్ద సర్పం గత కొంతకాలం వరకూ తిరుగాడుతూ ఉండేది. ఈ దృశ్యం చాలా మందికి ప్రత్యక్ష అనుభవం.

ఉదయం సుప్రభాతం తో ప్రారంభమయ్యే ఈ వేడుకలు రాత్రి ఏకాంత సేవతో ముగుస్తాయి. వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నా వేడుకల నిర్వహణ నేటికీ సంప్రదాయబద్దంగానే సాగుతున్నాయి. 
అంగరంగ వైభవంగా వేడుకలు, పోటాపోటీగా భక్తి సంగీత కచేరీలు,  రెండు బృందాల మధ్య బాణా సంచా పోటీలు, తెల్లవారేదాకా జాగరణ వీటితో బిక్కవోలు గ్రామంలో

సుబ్రమణ్య షష్ఠి వేడుకలు నిర్వహిస్తుంటారు. దశాబ్దాల కాలం నుంచి ఈ వేడుకలు ప్రతీ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తుంటారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వేడుకల్లో అందరూ కలిసి పాల్గొనడం, మనస్పర్థలకు ఆస్కారం లేకుండా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధులు ఈ వైభవంలో

స్వామికి ఎటువంటి లోటూ రాకుండా అనేక ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. 

ఈ వేడుకల్లో జరిగే వేడుకలు ఇవే. .. : నవంబర్ 28 రాత్రి 9 గంటలకు ఉత్తరాభిమన్యుల కళ్యాణం బుర్రకథ నిర్వహించబడుతుంది. 

తెల్లవారితే  స్వామివారి కి 1.15 గంటల కు తీర్థపు బిందెసేవ తో ఉత్సవాలు మొదలవుతాయి. అంతరాలయంలో  విశేష

ఆరాధనలు ఆరంభమవుతాయి. ఉదయం 8.00, గంటలకు స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం వరకూ స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుంది. 
సాయంత్రం 4.30 నిమిషాల నుండి 5. 30 నిమిషాల వరకు పగలు బాణాసంచా కాల్చ బడుతుంది. 

తిరిగి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు బిక్కవోలు హై స్కూల్  గ్రౌండ్ నందు kallu మిరుమిట్లు

గొలిపే విధంగా బాణాసంచా పోటీ జరుగుతుంది. 

సంతాన లేమికి పరిష్కారం ఈ ఆలయం :.  

సంతాన లేమితో బాధపడే భక్తులకు ఈ ఆలయం ఒక పరిష్కారం చూపిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. ఎన్నో కారణాల వల్ల సంతానం లభించని దంపతులు ఈ ఆలయాన్ని షష్టి  రోజున దర్శించుకుని మహిళలు ఆలయ ప్రాంగణం నిద్రించడం ఒక సంప్రదాయం. స్వామి

అనుగ్రహం ఫలితంగా వీరికి ఉన్న సమస్యలకు వైద్య పరమైన పరిష్కారాలు ఫలించి సంతానం కలగడం ఒక శుభపరిణామం, మరి కొందరికి దత్తత చేసుకునేందుకు ఉన్న అవకాశాలు సానుకూల పడుతుంటాయి అనేది ప్రగాఢ నమ్మకం. ఈ నమ్మకాలకు ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు ఈ ఆలయాన్ని వచ్చే భక్తుల ద్వారానే తెలుసుకోవచ్చు. 

షష్టి వైభవం

:

మార్గశిర శుద్ధ షష్టి ని అత్యంత పవిత్రమైన రోజుగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకను పురస్క రించుకుని ఈ నెల 13 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవాలయాల్లో షష్టి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తు న్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటకు 16 కిలోమీటర్ల దూరంలోని బిక్కవోలు మండల కేంద్రంలోని ఈ ఆలయంలో శతాబ్దాల నుంచి

అత్యంత వైభవంగా షష్టి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. సుబ్రహ్మ ణ్యుడే స్వయంగా ప్రతిష్ట చేసిన గోలింగేశ్వర స్వామి నెలకొనియున్నందున సు బ్రహ్మణ్యునితో పాటు ఆయనకూ ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ప్రాత:కాలం నుంచే సుదూ ర ప్రాంతాలకు చెందిన వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుండడంతో ఆలయ

నిర్వాహకలు ప్రత్యేక ఏర్పాట్లు తో పాటు, అన్న ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించే ఏర్పాట్లు చేసారు. 

దేశంలోనే అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా కీర్తి గాంచిన ఈ ఆలయ అభివృద్ధిలో ఎందరో రాజులు, సంస్ధానాధీశులు తమ వంతు కృషిని జరిపారు. దీనికి నిదర్శనంగా ఎన్నో శాసనాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుం టాయి. ప్రధానంగా ఈ ఆయ

దర్శనం చేసి, ఆలయంలో ప్రాత:కాలం లో నిద్రించిన మహిళలకు సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో అత్యంత పటిష్టంగా ఉండడంతో పాటు, స్వామి అనుగ్రహం లభించిన మహిళలు సైతం వందల సంఖ్యలో ఈ రోజున స్వామి దర్శనానికి వస్తుంటారు. గోలింగేశ్వర స్వామి ఆలయంలోని స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకాను న్నందున విశాఖ జిల్లా నుంచే

కాక, రాష్ట్రంలోని ఇతర జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.  దాదాపు లక్షకు పైగా భక్తులు ఈ స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటు వంటి అవాంతరాలు కలుగకుండా ఆలయ కమిటీ చేస్తున్న ఏర్పాట్లతో పాటు, స్ధానిక పోలీసు, రెవిన్యూ విభాగాలు ప్రత్యక్ష పర్యవేక్షణలో పాల్గొంటున్నాయి. ఈ

గ్రామానికి చేరుకోడానికి రాజమం డ్రి - కాకినాడ బస్సు ( కెనాల్‌ రోడ్‌ ) లో బస్సు సౌకర్యంతో పాటు, ఈ మార్గంలో గల  రైలు మార్గంలో పాసింజరు రైళ్ళు ద్వారా చేరుకోవచ్చు.  అనంత రం సాయంత్రం రెండు బృందాల మ ధ్య జరిగే బాణా సంచా పోటీలు రాష్ట్రం లోనే ప్రథమ స్ధానంలో ఉంటాయన్నది అతిశయోక్తి కాదు. రెండు గ్రామాలకు చెందిన భక్తులు

పోటాపోటీగా బాణా సంచా పోటీల్లో పాల్గొని భక్తులను ఆకర్షి స్తుంటారు. 

ఉదయం నుంచే ఆలయ ప్రాంగ ణంలో ఏర్పాటు చేసిన పెండాల్స్‌ వద్ద నిర్విరామంగా సాగే భక్తి సంగీతం కార్య క్రమాల్లొప్రసిద్ధ గాయనీ గాయకులు సైతం స్వామి ఉత్సవాల్లో పాల్గోనేందుకు ఆసక్తి చూపుతుంటారు.

విస్తృతంగా ఆర్టీసీ సేవలు

 : 

సుబ్రహ్మణ్య షష్టి వేడుకల్లో పాల్గొనేందుకు బిక్కవోలు గ్రామానికి వేలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుండడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు సర్వీసులు నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి 40 కి పైగా సర్వీసులను నడుపుతోంది. దీనికి అదనంగా పశ్చిమ గోదావరి,

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణ, తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam