DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో మహిళారక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం: వాసిరెడ్డి

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*    

*Amaravati, Nov 30 , 2022 (DNS Online) :* మహిళలపై హింస పెరిగిపోతుందని,  ప్రేమ, పెళ్లి అని ఎవరు వెంటపడితే మోసపోవద్దని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. బుధవారం రాజమహేద్రవరం  కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం నిషేధం పరిహారం పై అవగాహనా

కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. 
మహిళా మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యవం లో జరిగిన ఈ కార్యక్రమము లో ఆమె మాట్లాడుతూ, మహిళలు బాలికలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలకు సంబంధించి  చట్టాలు ఉద్దేశించి  వాటి ప్రాముఖ్యతను, వాటి విలువలను  గురించి, చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలో మహిళల్లో మరింత అవగాహన

 పై వివరాలు తెలియచేసినారు. మహిళలపై జరుగుతున్నా హింస, ఆకృత్యాలను తెలిపి, వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. 
 కార్యక్రమం లో పాల్గొన్న డిఎల్ఎస్ఏ ప్రతినిధి సీనియర్ సివిల్  జడ్జి కె. ప్రత్యూష కుమారి  మాట్లాడుతూ ,   మహిళలకు మరియు బాలికలకు  ఉపయోగపడే అనేక  చట్టాలను ఉన్నాయి అని,  వాటిని ఎలా ఉపయోగించుకోవాలో,

 మరియు మహిళాల పై జరుగుతున్న హింస  మరియు  లైంగిక వేదింపులు, నిరోధించటం, మరియు  పరిహారం, బాల్య వివాహాలు  గురించి  వివరించి వాటి కోసం కోర్టును ఎలా  ఆశ్రయించాల  తెలియచేసినారు.  పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం-2013, గృహ హింస చట్టం -2005 , బాల్య వివాహ చట్టం, వరకట్న మరణం, సెక్షన్ 498 (A) మరియు ఆర్టికల్ 14గురించి

 వివరించారు.

కార్యక్రమం లో మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ  రెడ్డి, చైల్డ్  రైట్ కమిషన్ ప్రతినిధులు, కందుకూరి  రాజ్యలక్ష్మి మహిళా  కళాశాల ప్రిన్సిపాల్, ఐసిడిఎస్ అధికారులు విద్యార్థినిలు , తదితరులు హాజరయ్యారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam