DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హత లేకున్నా డాక్టర్ గా చలామణి అవుతు ప్రజా వంచన, రాజశేఖర్ అరెస్టు

(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి , డిసెంబర్  14, 2022 (డిఎన్ఎస్):* ఎమ్బిబిఎస్ సహా ఎటువంటి వైద్య సర్టిఫికేట్ లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపై  కేసులు నమోదు చేయడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత హెచ్చరించారు. డాక్టర్ అర్హత లేకపోయినా గత నాలుగు

సంవత్సరాలుగా ఐఎమ్ఐ నంబర్ తీసుకుని వైద్యం చేస్తూన్న వి. రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఎమ్.బి.బి.ఎస్. చదవకపోయినా ఐ ఎమ్ ఐ తీసుకుని నగరంలో ప్రజలకు వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే కాకుండా కొందరి మరణించడానికి రాజశేఖర్ కారణం అయ్యారన్నారు. ఈ విషయం పై ఐ ఎమ్ ఐ తో సంప్రదించడం

జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రాజమహేంద్రవరం లో కొత్తగా పలు ఆసుపత్రులు ఏర్పాటు చెయ్యడం జరిగిందని, ఆ సందర్భంలో అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. 
ఆమేరకు వారి యొక్క అర్హతలను తనిఖీ చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇటువంటి డాక్టర్లు గా చెలామణి అవుతున్న వంచకుల

వివరాలు, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రులను నిర్వహిస్తున్న వారిని గుర్తిం చేందుకు నాలుగు బృందాలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆ బృందాలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి నివేదిక అంద జేస్తారన్నారు. నివేదిక అందిన తరువాత సరైన అనుమతులు

లేకుండా ఆసుపత్రులను నిర్వహిస్తున్నా వారిపై, డాక్టర్ గా అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 

ప్రజల ఆరోగ్యం తో చెలగాటం అడే

వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆరోగ్య పరంగా ఎన్నో సంస్కరణలు చేపడుతుంటే, ఇటువంటి కొందరు వ్యక్తుల చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam