DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నక్కపల్లి లో వైభవంగా గోదాదేవి తిరునక్షత్రం

విశాఖపట్నం, ఆగస్టు 13, 2018  (DNS  Online ):  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానములు అనుబంధ దేవాలయమైన ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం గోదాదేవి తిరునక్షత్రం

అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య కార్యక్రమాలు అనంతరం గోదాదేవి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు,

ఎస్.టి.పి.నరసింహాచార్యులు ఎన్.సిహెచ్. శ్రీనివాసులు, ఇల్లింద గోపాలాచార్యులు, బి.హెచ్. గోపాలాచార్యులు తదితరులు విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, మూలమూర్తికి,

ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి గోదాదేవి అమ్మవారికి లక్ష్మీ సహస్ర నామ కుంకుమ పూజ నిర్వహించారు. దీనిలో భాగంగా

నాలాయిర సేవాకాలం ప్రసాదనివేదనలు,నీరాజన మంత్రపుష్పాలు, తీర్ధగోష్ఠి ప్రసాద వినియోగం నిర్వహించారు. ఈకార్యక్రమంలో నండూరి రాజగోపాలాచార్యులు, నున్న

సుభాష్,నక్కపల్లి, యస్. రాయవరం మండలాల్లో గల శ్రీవైష్ణవ గోష్టి సభ్యులు దేవస్థానం ఇనస్పెక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది బివిజి రాజశేఖర్ పలువురు భక్తులు

పాల్గొన్నారు

 

#dns #dnslive #dns live #dnsnews #dns news #dnsmedia  #nakkapalli  #andal  #tirunakshatram  #visakhapatnam #vizag

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam