DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో మతోన్మాద సైకోలకి హిందు గుళ్లే కనపడుతున్నాయా: విహెచ్పి మండిపాటు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, డిసెంబర్  28, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 24 న కాకినాడ అచ్యుతాపురం రైల్వే గెట్ వద్ద గల దేవాదాయ శాఖా కృష్ణ మందిరంలోని హనుమాన్ విగ్రహం పై పిచ్చెక్కిన మతోన్మాదులు పెట్రోల్ పోసి మంటపెట్టిన ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బుధవారం నిరసనలు

చేపట్టింది. చలో కాకినాడ ఉద్యమానికి పిలుపునివ్వడంతో విశాఖ జిల్లాలోని విహెచ్ఫై నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేసారు. అనంతరం విహెచ్పి జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ సారధ్యంలో ధార్మిక సంఘాల ప్రతినిధులు  సింహాచలం తొలిపావంచా వద్ద నిరనస చేపట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా శర్మ మాట్లాడుతూ హిందూ

దేవాలయాలపై పిచ్చెక్కిన మతోన్మాదులు చేస్తున్న భౌతిక దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసనలు చేపట్టిందన్నారు. 
గత కొన్ని ఏళ్లుగా హిందూ దేవాలయ పై దాడులు జరుగుతున్న పట్టింపులేని పొలిసు వ్యవస్థ, హిందూ సంఘాలు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే అడ్డుకోడానికి సర్వశక్తులు

ఒడ్డారన్నారు. 

కాకినాడ ఘటనలో తన సభ్యులు మతోన్మాదిని స్వయంగా పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి అప్పగిస్తే. . .అతనికి పిచ్చ్చేక్కిందని వదిలేశారని మండిపడ్డారు. దీనికి నిరసనగా చలో కాకినాడ కు పిలుపు ఇస్తే. .తమను హౌస్ అరెస్ట్ చెయ్యడానికి మాత్రం పోలీస్ వ్యవస్థ ముందుకు వచ్చిందన్నారు. 

*ఈ సందర్బంగా

సంధించిన ప్రశ్నలు ఇవే :*

1. సంఘటన జరిన వెంటనే దర్యాప్తు చేయకుండా ముందుగానే ఆ వ్యక్తి మతిస్థిమితం లేనివాడు అని డిఎస్పీ  ఎలా ప్రకటిస్తారు?.

2. గతంలో కూడా ఇలా మతిస్థిమితం లేనివారు అని కేసులను రాష్ట్రంలో పోలీసులు నిర్వీర్యం చేసినట్లే ఇదీ చేయాలనే కుతంత్రమా?

3. కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే

విగ్రహాలకు రంగులు వేయడం సాక్ష్యాలను మాయం చేయడం కాదా?

4. మతిస్థిమితం లేని వానివద్ద వేల రూపాయలు ఎలా ఉన్నాయి? ఎవరు ఇచ్చారు?

5. పెట్రోలు బంకులో అతను పెట్రోల్   పోయించుకున్న సీసీ పుటేజ్ సేకరించారా?

6. విగ్రహ ధ్వంసం చేసిన వ్యక్తి గ్రామస్థులతో ఈపని చేయమని ఫలానా చర్చి ఫాస్టర్ నాకు డబ్బులు

ఇచ్చాడు అని చెబితే ఆవిషయాన్ని ఎందుకు దర్యాప్తు చేయడంలేదు?

7. గతంలో పిఠాపురంలో 19 విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు కూడా మతిస్థిమితం లేనివాడు అనే చెప్పిన చరిత్ర  పోలీసులది కాదా?

8. రాష్ట్రంలోని మతిస్థిమితం లేని వారంతా హిందువుల ఆలయాలపై మాత్రమే దాడి చేస్తారా?

9 . కేసును కోర్టుకు అప్పగించకుండా

పోలీసులు ప్రకటనలు చేయడం సమంజసమా?

10 . ప్రెస్ నోట్ నేను ఇవ్వలేదు అంటున్న DSP గారు మరి అది ఇచ్చిన వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? 

11. దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి పూర్తిగా తీసుకోకుండా నిరసన చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేస్తామని అనడం ఎవరి కళ్లల్లో ఆనందం చూడడానికి? 

12. దేవాలయాలను

రక్షిస్తామన్న ఎండోమెంట్ శాఖ విగ్రహాలు ధ్వంసం అవుతుంటే చర్యలు తీసుకోవటం మాని ఆలయ EO విగ్రహం దగ్గర నేను మడత మంచం వేసుకుని పడుకోవాలా అని నిర్లక్ష్యంగా సమాధానం చెపుతాడా?

13. విగ్రహంపైన దాడి చేసిన వ్యక్తి విషయములో సత్వరం స్పందించని EO, నిరసన తెలుపుతున్న హిందువులపై అర్చకుని ద్వారా ఫిర్యాదు చేయుటకు ఆర్చకునిపై

వత్తిడి చేసి సంతకాలు చేయిస్తారా?

వీటికి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam