DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని చీకటి జీవోలు తెచ్చారు.: నాదెండ్ల

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జనవరి 05, 2022 (డిఎన్ఎస్):* ప్రతిపక్షాలు ప్రజలోకి వెళ్తే ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోతుందనే భయంతోనే వైసీపీ చీకటి జీవోల ద్వారా సభలు, సమావేశాల మీద ఆంక్షలు విధిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గురువారం విశాఖపట్నంలో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. 

అందులోని ముఖ్యాంశాలు...
• 175కి 175 స్థానాలు గెలుస్తామన్న శ్రీ జగన్ రెడ్డి గారికి ఎందుకు అంత అభద్రతా భావం? ఎందుకు నిరంకుశ జీవోలు తీసుకువస్తున్నారు.
* ఈ ముఖ్యమంత్రిది డైవర్షన్ విధానం. పెన్షన్లు లక్షల్లో తొలగించారు.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి

ఆందోళనకి గురి చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి దిగజారింది. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జీవో 1 తెచ్చారు.
• ముఖ్యమంత్రి హెలీకాప్టర్లలో తిరుగుతారు. ప్రజలు కట్టిన పన్నుల  డబ్బుతో సభలు ఏర్పాటు చేసి ఆ సభల్ని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు.


ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత  తట్టుకోలేక.. ప్రతిపక్షాల ప్రస్థానాన్ని ఆపేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలను ఖండిస్తున్నాం. 
• ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తే అయితే ఎందుకు ప్రజల వద్దకు రాడు. వేల మంది పోలీసుల్ని పెట్టుకుని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు. లబ్దిదారులతో

నిర్వహించే సభలకు లబ్దిదారుల్ని బలవంతంగా తరలించే పరిస్థితి ఏంటి?
•  ప్రతిపక్ష పార్టీలుగా ప్రజా సమస్యలపై గళం విప్పే బాధ్యత మాకుంది. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
• ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఎన్ని ఒత్తిడులు తీసుకువచ్చినా.. చట్టాలను గౌరవిస్తాం.. ప్రజల్ని గౌరవిస్తాం.. ప్రజల గొంతు వినిపించడం మా

బాధ్యతగా ముందుకు వెళ్తాం.
• బటన్లు నొక్కేసి అభివృద్ధి జరిగిపోతోందని చెప్పడం.. సభలకు రాకపోతే ఫించన్లు తీసేస్తాం అని బెదిరించడం.. ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిస్తే లక్ష వస్తాయని కొత్త డ్రామాలు మొదలు పెట్టారు.
• దివ్యాంగులు కారు ఆపితే రూ. లక్ష ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు.. ఇదే ముఖ్యమంత్రి

మూడున్నరేళ్లుగా వారి సమస్యల మీద ఎందుకు స్పందించలేదు?
• అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తుంటే సభలపై ఆంక్షలు ఎందుకు? మీటింగులు రద్దు చేసుకోవాలి.. అనుమతులు లేవు అని జిల్లా ఎస్పీలతో ఫోన్లు చేసి బెదిరింపులు ఎందుకు.. మీరేం చేసినా జనసేన పార్టీ

వెనుకడుగు వేయదు.
• ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు. అది చూసి అభద్రతా భావంతో ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తిస్తున్నారు.
• జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా జాగ్రత్తగా చేస్తుంది. ప్రతి ఒక్కరినీ ఇంటికి పంపే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ పని తీరు పట్ల ప్రజల్లో ఆందోళన మొదలయ్యిందనే

ఇలాంటి డైవర్షన్లకు పాల్పడుతున్నారు.
• ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి అనుమతి కావాలి అంటే ఎలా? మనం ఏ దేశంలో ఉన్నాం. జనసేన పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
• యువశక్తి కార్యక్రమానికి సంబంధించి డిసెంబర్ 23వ తేదీన డీజీపీకి ఉత్తరం రాశాం. 24వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి మా

నాయకులు అనుమతి కోరారు. రూట్ మ్యాప్స్, భద్రత ఏర్పాట్లు, సౌకర్యాల వివరాలు తెలియచేశాం. మా కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండదని నమ్ముతున్నాం.
 *బి.ఆర్.ఎస్. పార్టీ గురించి..* 
• శ్రీ జగన్ రెడ్డికి సహకారం అందించడానికీ.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటు చీల్చడానికి బీఆర్ఎస్ ముసుగులో ప్రయత్నం

చేస్తున్నారు.
• బంగారు తెలంగాణ కోసం మీరు నిలబడ్డారు.. బంగారు ఆంధ్రప్రదేశ్ కోసం కాదు 
• రాజకీయాల్లో నిజాయతీతో కూడిన ఆలోచనా విధానం ఉండాలి.. మీటింగులు పెట్టుకుని జాయినింగులు చేసుకుంటే అయిపోదు. కృష్ణా-గోదావరి జలాల విషయంలో మీ ప్రణాళిక ఏంటో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ఆలోచనతో వచ్చి సేవా కార్యక్రమాలు

చేయగలరో చెప్పాలి
• కేసీఆర్ గారు ఓవర్ నైట్ పార్టీ పెట్టి దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాడుతాను అంటున్నారు. మీ విధానాల్లో నిజాయతీ ఏది? ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎలా ఉపయోగపడతారో చెప్పాలి.

విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు టి. శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam