DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలాపురస్కర్ 2023 అవార్డు గ్రహీత చెస్ మీనాక్షి కి విశాఖ కలెక్టర్ అభినందనలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2023 (డిఎన్ఎస్):* గత నెల 26 జనవరి 2023 న గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడా విభాగములో బాల పురస్కార్- 2023 అవార్డు ను అందుకున్న విశాఖ చదరంగం క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి వుమెన్ విశాఖ ఫిడే మాస్టర్

టైటిల్ సాధించడంతో విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఏ మల్లికార్జున అభినందనలు తెలిపారు. 
అంతకు ముందు విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇంచార్జి అధికారి ఎం సూర్యారావు క్రీడాకారిణి ని జిల్లా కలెక్టర్ కు పరిచయం చేశారు.  జిల్లా విశాఖపట్నం వారు చదరంగం క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి వుమెన్ ఫిడే మాస్టర్ టైటిల్ గ్రహీత

మరియు ప్రధాన మంత్రి రాష్ట్రీయ । పురస్కార్ అవార్డ్ ని అభినందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా చదరంగం సంఘం ప్రతినిధులు మణికంఠ రావు, చిరంజీవి, తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam