DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ శ్రేయస్సులో బాలికల పాత్ర ఎంతో ముఖ్యం, బేటి బచావ్ అవగాహన

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2023 (డిఎన్ఎస్):* శ్రేయస్కరమైన సమాజాన్ని నిర్మించడంలో బాలికలు, మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని బుచ్చిరాజుపాలెం పిహెచ్ సి వైద్యురాలు డా .దీపిక తెలియచేసారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం విశాఖ లో జరిగిన సేవ్ గర్ల్ చైల్డ్, బేటి బచావ్

భేటీ పడావో కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టపరంగా నేరమని, ఈతరహా పరీక్షలకు దూరంగా వుండాలని తెలియచేస్తూ అవగాహనా కల్పించారు. 1994 నుంచి సేవ్ గర్ల్ చైల్డ్, బేటి బచావ్ భేటీ పడావో కార్యక్రమానికి ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. 

విశాఖపట్టణం జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం వైఎస్ ఆర్

పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో లింగ నిర్ధారణ పరీక్షలు నేరం.. బాలికలను జీవించనిద్దాం అంటూ హస్పిటల్ సిబ్బంది, నర్సులు నినాదాలు చేశారు. సేవ్ గర్ల్ చైల్డ్ అంటూ నినదించారు. బుచ్చిరాజుపాలెం, ఎన్ ఏడి సమీప రహదారుల్లో  ర్యాలీ నిర్వహించారు. బాలికలపై వివక్ష పెరుగుతున్న నేపధ్యంలో

వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని డా .దీపిక పేర్కొన్నారు. గర్ల్ చైల్డ్ ను రక్షించుకోవాల్సిన అవసరం సమాజంలో అందరిపై వుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam