DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చ్ 1 నుంచి అహోబల జీయర్ స్వామి వారిచే భాగవత సప్తాహం

*విజయనగరం లో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు ప్రవచనం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2023 (డిఎన్ఎస్):* పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ అహోబల రామానుజ జీయర్ స్వామి వారు విజయ నగరం లో మార్చి 1 నుంచి భాగవత సప్తాహం వైభవం అందించనున్నారు. విద్యల

నగరం విజయనగరం లో ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించేందుకు స్వామివారు ఈ భాగవత సప్తాహం విజయనగరం లోని కొత్తపేట లో గల శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయం ( కొత్త కోవెల ) లో మార్చి 1 నుంచి భాగవత సప్తాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1 నుంచి 8 వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు సేవాకాలం, తిరువారాధన, తీర్థ

గోష్ఠి, తదుపరి ద్వాదశాక్షరి మంత్ర ప్రయుక్తంగా హోమం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి అదే ప్రాంగణం లో  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అనంతరం 6 గంటల నుంచి జీయర్ స్వామివారు శ్రీమద్భావత వైభవం పై అనుగ్రహ భాషణం చేయనున్నారు. చివరి రోజు మార్చ్ 8 న అత్యంత

వైభవంగా రుక్మిణి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సప్తాహ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, శ్రీకృష్ణ అనుగ్రహం, జీయర్ స్వామి వారి మంగళా శాసనములు పొందవలసింది గా ఆహ్వానిస్తున్నారు.
గత ఏడాది విజయనగరం లోనే అహోబల జీయర్ స్వామి అత్యంత వైభవంగా ధనుర్మాస వ్రతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమ వైభవాన్ని

DNS మీడియా ద్వారా భక్తులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam