DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వాతంత్య్ర వేడుకల్లో కూడా కులాల కుంపటేనా? ఇంతకీ ఇది శ్రీకా

ఇంతకీ ఇది శ్రీకా "కుల" మేనా ?

ఏపీ లో అద్భుతం à°—à°¾ సాగుతున్న తెలుగు ప్రచారం. 

(courtesy : KNR, Srikakulam)

శ్రీకాకుళం, ఆగస్టు 15 , 2018 (DNS Online ): కులాల కుంపటిలో కుళ్ళి పోతున్న నేటి

రాజకీయాలను ఆఖరికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలోకి కూడా తీసుకు వచ్చేసిన ఘనత శ్రీకాకుళం జిల్లా అధికారులకే దక్కుతుంది. ఓట్ల రాజకీయాల కోసం అన్ని రాజకీయ

పార్టీలు కొట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళతో కలిసిపోయారా అనేట్టు గా ప్రభుత్వ స్వాగత ద్వారాలు

దర్శనమిస్తున్నాయి. 
తెలుగు బాషా ప్రయుక్త విధంగా à°—à°¾ ఏర్పడిన తొలి రాష్ట్రం  à°à°°à±à°ªà°¡à°¿à°¨ ఆంధ్ర ప్రదేశ్. తెలుగు భాష ఆధారంగా ఏర్పడిన రాష్ట్రం లో నేడు అదే తెలుగు

భాషకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అత్యద్భుతంగా ఉంది. 

శ్రీకాకుళం జిల్లా కేంద్రం లో  72 à°µ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జాతీయ రహదారి ( NH 16 ) పై ఏర్పాటు చేసిన స్వాగత

ద్వారం తెలుగు భాష ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం వెలగబెడుతున్న పనితీరు అడ్డం పడుతోంది. అసలు తెలుగు భాషను ఇలాగ కూడా ఉపయోగించవచ్చు అని తెలియచేసిన ఘనులు

ప్రభుత్వం లో ఉన్నారు అని తెలుస్తోంది. అది కూడా  à°¤à±†à°²à±à°—ు భాష పై అభిమానం తో నాటి నటుడు ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉండగానే జరగడం

గమనార్హం. ఒక ప్రక్క తెలుగు భాష ను చంపేస్తున్నారు, బ్రతికించండి మహా ప్రభో అని తెలుగు దండు లాంటి తెలుగు భాషా ఉద్యమ ప్రచార సంఘాలు, రోడ్డెక్కి నిరాహార దీక్షలు,

నిరసనలు చేస్తుంటే కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం, నేడు తన అసలు ఉద్దేశ్యం ఏంటో బయట పెట్టింది. అన్ని పాఠశాలల్లోనూ తెలుగు భాష కంటే ఎక్కువగా మించిన రీతిలో ఆంగ్ల

భాషను చిన్నారుల పై రుద్దుతూ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు గా వ్యవహరిస్తోంది అని భాష అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రభుత్వం పనితీరే అలాగే ఉంటె

 à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటో ఊహించనక్కరలేదు మరి.  à°…సలు అధికారులకే తెలుగు భాష సక్రమంగా రాక పొతే క్రింది స్థాయి వాళ్ళనేలా

ఆదేశించగలరు ?

దీని అర్ధం వివరించగలరు... : 

స్వాగత ద్వారాలు, ఆహ్వానం లో  à°¶à±à°°à±€ à°•à°¾ "కులం"   " దిననోత్సవం " అని వ్రాసారు, దాని అర్ధం ఏంటో  ఆంధ్ర రాష్ట్ర

ప్రజలకు వివరిస్తే తెలుసుకుని తరించగలరు. 
 
à°ˆ పంద్రాగష్టు వేడుకలకి సుమారు 60  à°•à±‹à°Ÿà±à°² రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి ఘనంగా చేస్తున్నాం అని ఆర్భాటంగా ప్రకటనలు

చేసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వానికి, పాలకులకు క్రింది స్థాయి లో జరుగుతున్న తప్పిదాలు కనపడక పోవడం అత్యంత దురదృష్టకరం. ఒకవేళ కనిపించినా వీళ్ళ తప్పు

సరిదిద్దక పోవడం మరింత దుర్భరం. 

విశ్రాంత తెలుగు  à°¬à°¾à°·à°¾ పండితుల సేవలు à°ˆ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఎంతో అవసరం ఉన్నట్టుగా కనపడుతోంది. అధికారులు

తెలుగు భాషను ఉద్దరించనవసరం లేదు, దాని హింసించకుండా ఉంటే అదే పదివేలు అన్న అభిప్రాయానికి తెలుగు ప్రజలు వచ్చేసారు. 

 

#dns #dnsnews #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media #vizag  #visakhapatnam #visakha news  #telugu #andhra pradesh

#ap #government

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam