DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీచ్ లో  బైక్ ఫీట్లు వినోదమా?  లేక విన్యాసమా ?

విశాఖపట్నం, ఆగస్టు 15 ,2018 (DNS Online ): విశాఖ సాగర తీరం ( బీచ్ ) లో జరుగుతున్న బైక్ రేస్ లు, బైక్ పై ఫీట్లు వినోదం కోసమా లేక, విన్యాసమో తెలియక నగర వాసులు, సందర్శకులు నానా

ఇబ్బందులు పడుతున్నారు. కొందరు యువకులు బైక్ లకు సైలన్సర్లు తొలగించి విపరీతమైన వేగంతో వెళ్తూ, బీచ్ రోడ్ వాసులను భయబ్రాంతులని చేస్తున్న పట్టించుకునే తీరిక

అధికారులకు ఉన్నట్టు కనపడడం లేదు. ఈ విధమైన బైక్ రేస్ లు సాగర తీరంలో నిత్యం జరుగుతూనే ఉన్నా అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారు. ఇటీవల కాలంలో ఈవిధంగా భయానకంగా

డ్రైవింగ్ చేసే వారిని అరెస్ట్ చేసి, సుమారు వంద బైక్ లను స్వాధీనం చేసుకుని, యువకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సలింగ్ చేసినా నగర ప్రజలకు పెద్దగా గుణపాఠం

కలిగినట్టు లేదు. బుధవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, బీచ్ రోడ్ లో రామకృష్ణా బీచ్ నుంచి, పేదవాల్తేరు బస్ డిపో వరకు భారీ సంఖ్యలో బైక్ రేస్ లు

నిర్వహించారు. అయితే భారత త్రివర్ణ పతాకం ధరించి మరీ, విన్యాసాలు చేస్తూ సైలన్సర్లు తీసేసిన బైక్ లపై ఒకే బైక్ పై నలుగురు ప్రయాణించి, దారిలో వెళ్లే వాహనదారులను

భయభ్రాంతులను చేయడం జరిగింది. ఈ బైక్ లను రద్దు చేయమంటూ నగర వాసులు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. ప్రధానంగా ఈ విధమైన బైక్ లు విశాఖ నగరం

లో పెరిగిపోయి, రహదారి ప్రమాదాలకు కారణం కూడా అవుతున్నాయి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఈ తరహా బైక్ లు కొని ఇవ్వడం ఒక ప్రెస్టేజ్ గా భావించడం

శోచనీయం. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #beach road  #beach  #visakhapatnam  #vizag  #vizag beach  #bike race  #duke bike 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam