DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ ని విశ్వవిజేతగా నిలిచిన జిఐఎస్ లో వెలువరించిన పెట్టుబడులు ఇవే

*మేటి దిగ్గజాల రాకతో 50% విజయం, పెట్టుబడులతో పూర్తి విజయం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 04, 2023 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ ను విశ్వ విజేతగా నిలిపేందుకు కేవలం రెండు నెలల కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు అధికారులు, మీడియా అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే విశ్వ విఖ్యాత

పెట్టుబడుల సదస్సు. 
రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల ప్రతినిధులు విశాఖ తరలివచ్చారు. ప్రపంచమంతా కేవలం దర్శనం కోసం ముకేశ్ అంబానీ ఇంటి ముంగిట నిలుస్తుంటే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఐటి మంత్రి గుడివాడ అమర్ నాధ్ లు చేసిన ఆహ్వానం

మేరకు ముకేశ్ అంబానీ ఏకంగా 8 గంటల పాటు ఈ సదస్సులో పాల్గొని ప్రపంచాన్ని ఏపీ వైపు త్రిప్పేలా చేయగలగడం అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ఇలా ప్రపంచ పారిశ్రామిక రంగంలో మహా దిగ్గజాలైన వాళ్ళని సైతం విశాఖ కు రప్పించడం మరో విజయంగా భావించవచ్చు. ఇక పెట్టుబడుల వెల్లువలతో పూర్తి విజయం సాధించారు అని చెప్పవచ్చు. ఈ ఒప్పందాలను

వాస్తవరూపంలోకి తీసుకురావడమే ప్రభుత్వ సారధులు ముందున్న లక్ష్యం.      

ఈ సదస్సులో జరిగిన ఒప్పందాల్లో శాఖా వారీగా  వివరాలు ఇవే. . .

1 . వ్యవసాయ శాఖ రంగంలో  15 ఒప్పందాలు జరగగా రూ. 1160  కోట్ల పెట్టుబడులకు గాను 280 మందికి ఉపాధి లభిస్తుంది. 

2 . జంతు సంరక్షణ శాఖ రంగంలో  8 ఒప్పందాలు జరగగా రూ. 1020

 కోట్ల పెట్టుబడులకు గాను  3750 మందికి ఉపాధి లభిస్తుంది. 

3 . ఇంధన శాఖ రంగంలో  39 ఒప్పందాలు జరగగా రూ. 893573  కోట్ల పెట్టుబడులకు గాను  1,66,650 మందికి ఉపాధి లభిస్తుంది. 

4 . పరిశ్రమలు & వాణిజ్యం రంగంలో  99 ఒప్పందాలు జరగగా రూ. 3,36,054  కోట్ల పెట్టుబడులకు గాను   2,25,759 మందికి ఉపాధి లభిస్తుంది. ,

5 .  IT & ITES

శాఖ రంగంలో   100 ఒప్పందాలు జరగగా రూ. 87,831   కోట్ల పెట్టుబడులకు గాను  1,82,642 మందికి ఉపాధి లభిస్తుంది. 

6 . ‘పర్యాటక శాఖ రంగంలో  117 ఒప్పందాలు జరగగా రూ.22,096  కోట్ల పెట్టుబడులకు గాను   30,787 మందికి ఉపాధి లభిస్తుంది. 

మొత్తం  378 ఒప్పందాలు జరగగా రూ. 1,341,734  కోట్ల పెట్టుబడులకు గాను  6.09.868 మందికి ఉపాధి

లభిస్తుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam