DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిఐఎస్ 2023 విజయోత్సవ టీమ్ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు

*మంత్రి అమర్, ఇండస్ట్రీస్ కమిషనర్ సృజనలకు ప్రత్యేక ప్రసంశలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 07 , 2023 (డిఎన్ఎస్):* రెండు రోజుల క్రితం విశాఖ వేదికగా జరిగిన  గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 ప్రపంచం అంతా హర్షధ్వానాలతో మారుమ్రోగేలా  అత్యంత విజయవంతంగా నిర్వహించిన

 బృందానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హార్దిక శుభాభినందనలు తెలిపారు. మంగళవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో అతి తక్కువ సమయంలో సదస్సు ను ఊహించని రీతిలో విజయం చేసిన మంత్రి గుడివాడ అమర్ నాధ్, పరిశ్రమల శాఖా కమిషనర్ డా. సృజనాలకు ప్రత్యేక ప్రశంసలు అందించారు. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు

మోకా విజయ్ కుమార్ సిరిధాన్యాలను ఉపయోగించి తయారుచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని మంత్రి బహుకరించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ని యూఎన్ఓ ప్రకటించిందని దీన్ని పురస్కరించుకొని తీర్చిదిద్దిన ఈ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా తిలకించి ప్రత్యేకతలను

తెలుసుకున్నారు. 

ఈ సమావేశంలో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam