DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా.. విశాఖ రాజధాని రెఫరెండం పై మీ జవాబేదీ?: టీడీపీ ప్రశ్న

*వైకాపా కు టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ సూటి ప్రశ్న*

*( DNS Report : P. Raja, Bureau Chief, Amaravati)*    

*అమరావతి, మార్చ్ 17, 2023 (డిఎన్ఎస్):* విశాఖ రాజధాని గా ప్రకటించిన తర్వాత జరిగిన తోలి ఎన్నిక ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పై అధికార పార్టీ ఏమి జవాబిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి

పాతర్ల రమేష్ సూటిగ ప్రశ్నించారు. అమరావతిలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలన్నారు. కుట్ర రాజకీయాలు, ఆర్థిక ప్రలోభాలకు పటుభద్రుల ఓటర్లు లొంగలేలేదన్నారు.

 

ఉత్తరాంధ్రలో పట్టభద్రుల నియోజక వర్గం ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం దాదాపుగా ఖరారు అవ్వడంతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు.

అధికార బలంతో ఉన్న పాలకులకు ఓట్లు హక్కు అనే ఆయుధం ద్వారా పట్టభద్రులు

ప్రభుత్వానికి మంచి తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు,  

నాలుగేళ్ళ పాలనతో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలువ తెలిసిందన్నారు. రాబోయే ఎన్నికలకు ముందస్తు సూచికను పటుభద్రులు ఇచ్చారన్నారు. ఈ విజయం తో

తెలుగుదేశం శ్రేణుల్లో పునరుజ్జీవం లభించనుందన్నారు. 

రాయలసీమలో కూడా వైసిపికి వ్యతిరేకత బాగా ఉందని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తేలిపోయిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అధికార పార్టీ కూడా ఊహించింది, అయితే ఇంత భారీగా వ్యతిరేకత ఉందని వాళ్ళ సర్వేలు కూడా ఊహించలేకపోయాయన్నారు. 

జగన్

ఇలాకాలో కూడా . . .

పులివెందులలోనే చదువుకున్న వారు వైఎస్ జగన్ భారీ షాక్  ఇచ్చారన్నారు. పులివెందులలో పట్టుభద్రుల ఎన్నికల్లో టిడిపికి 4323, వైసిపి కి 2120 లో ఇతరులకు, 180 మంది ఓట్లు  వచ్చాయని తెలిపారు. 
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు, ఐదు రౌండ్లు

ముగిసే సరికి తమ సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పై 16929 ఓట్లు అత్యధికంగా ఉన్నారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam