DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయ సాయిని ప్రక్కన బెట్టిన వైకాపా భారీ మూల్యం చెల్లించిందా?

*నాటి కలకలలు కిలకిలలు. . .నీదు కానరాలేదే. .*

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*    

*అమరావతి, మార్చ్ 19, 2023 (డిఎన్ఎస్  DNS Online ):* ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడానికి ప్రధాన కారణం విజయసాయి రెడ్డిని ప్రక్కన బెట్టడమే అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు

తెలియచేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తదుపరి జరిగిన ఎం ఎల్సీ  ఎన్నికల్లో ఉత్తరాంధ్ర లో పార్టీ అభ్యర్థి ఓటమికి అధిష్ఠానం సీరియస్ గానే ఉంది అని తెలుస్తోంది.   

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన సూత్ర దారి అయిన విజయసాయి రెడ్డిని నేడు దాదాపుగా ప్రక్కన

బెట్టినట్టే కనిపిస్తుందన్నారు. పార్టీని ప్రారంభించిన నాటి నుంచి పార్టీకి వెన్నంటే నిలిచి, అన్ని స్థాయిల నాయకత్వాన్ని, కార్యకర్తలకూ మార్గదర్శకం చేసిన స్థాయి విజయ సాయిదే. పార్టీ జండా మోసిన అధిక శాతం కార్యకర్తలతో వాలంటీర్ వ్యవస్థను, సోషల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీని పతాక స్థాయి తీసుకు వెళ్లిన విషయం

తెలిసిందే. 

విజయ సాయి కనుసన్నల్లోనే పార్టీలోని ప్రతి అంశం జరిగేది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది పురానా జమానా నాటి మాట. నేడు విజయసాయి కనిపించినా కార్యకర్తలు సైతం కనుమరుగవుతున్నారు అనే విషయం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

దీనికి ప్రధాన నిదర్శనమే. . .
పార్టీ అధికారం లోకి వచ్చిన

తొలినాళ్లలో విజయసాయి విశాఖ పర్యటనకు వస్తే. . ఉత్తరాంధ్ర జిల్లాలోని నాయకులూ, క్యాడర్ అంతా ఈయన ఇంటిముందే బారులు తీరి ఉండేవారు. అప్పోయింట్మెంట్ లేకుండా పార్టీ అగ్రనాయకులు, మంత్రులు సైతం విజయ సాయి ని కలవడం అత్యంత కష్టంగా ఉండేది అంటే అతిశయోక్తి కాదు. 
మూడేళ్ళ కాలంలో విజయసాయి గ్రేటర్ మహా విశాఖ నగరం ఎన్నికల్లో విజయ

సాయి త్రిప్పిన చక్రం కారణంగానే వైకాపా అధికారంలోకి రావడమే కాక, మేయర్ ఎన్నిక సైతం విజయసాయి ఆశీస్సులు పొందిన అభ్యర్థికే లభించింది అంటే. . ఈయన హావ ఏ స్థాయిలో ఉండేదో తెలుస్తోంది. ఈ క్రమంలోనే జివిఎంసి కమిషనర్ ఎన్నికల్లో వైకాపా కు పూర్తిగా సహకరించినా, విజయసాయి ఆదేశాలను అమలు చెయ్యడంలో వెనుకంజ వెయ్యడంతో విశాఖ నగర

మునిసిపల్ కమిషనర్ ను సెలవులోకి పంపి మరి మునిసిపల్ ఎన్నికలు జరిగి, మేయర్ ఎన్నిక జరిగే వరకూ మాత్రమే మరో మహిళా ఐ ఏ ఎస్ ను కేవలం రెండు వారల కోసం కమిషనర్ గా నియమించి చాకచక్యంగా నడిపించారు అంటే. . విజయసాయి హవా ఉత్తరాంధ్ర లో ఏ మేరకు ఉందేమో తెలుస్తోంది. ఇదే క్రమం లో ఎన్నో భూ కుంభ కోణాలు సైతం చోటు చేసుకున్నాయి. అధిష్ఠానానికి

మించి విజయసాయి హవా ఉత్తరాంధ్ర లో నడుస్తోంది అని గమనించిన అధిష్ఠానం మూడేళ్ళ కాలం గడిచాక అతన్ని తప్పించి, వైవి సుబ్బారెడ్డి ని ఈ ప్రాంతానికి ఇంచార్జి గా నియమించింది.

అయితే అపరచాణుక్యునిగా ప్రతిపక్షాలు సైతం కొనియాడి విజయసాయి స్థాయిలో పార్టీని నడిపించే నాయకుడు అధికార పార్టీలో లేకపోవడంతో ఇటీవల జరిగిన ఎం

ఎల్ సి ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అయితే ఈ విషయాన్నీ ప్రతిపక్షాలు గ్రహించినట్టు అధికార పార్టీ గమయించక పోవడం గమనార్హం. 

ఇంతకాలం అధికార పార్టీ విజయపధంలో నడిచిన ప్రతి అడుగులోనూ విజయసాయి పాత్ర కీలకం అని అంగీకరించక తప్పదు. పాలనా గడుస్తున్నా తరుణంలో సలహాదారులు మితిమీరి ఉండడం తో విజయసాయి స్పీడ్ కు

బ్రేక్ పడింది. 
విజయసాయి రెడ్డి లాంటి చాణుక్యుని ప్రక్కన బెట్టే విధానం ఇలాగె కొనసాగితే అధికార పార్టీ రానున్న కాలంలో మరింత భారీ మూల్యం చెల్లించక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam