DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కింగ్ మేకర్ నుంచి కింగ్ గా మారుతున్న బ్రాహ్మణ యువనేత పవన్

*గుంటూరు రాజకీయాల్లో సంచలనం బ్రాహ్మణ యువనేత పవన్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 22  2023 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో యువత క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య పోరాటం తీవ్రతరం అవుతోంది. ప్రధానంగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో యువత రాజకీయ ప్రవేశం సంచలనంగా మారుతోంది.

ఇప్పడి తరం సీనియర్లుగా మారుతున్న తరుణంలో యువత రంగంలోకి దిగుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి బలంగా వినిపిస్తున్న బ్రాహ్మణా యువ పారిశ్రామిక వేత్త పేరు యర్రమల్లి పవన్ కుమార్ శర్మ. త్వరలోనే  వందలాది మంది భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్ర బాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం

పార్టీ లో చేరనున్న పవన్ కుమార్ వివరాలు ఇవే. . .

ఎంబీఏ విద్యను అభ్యసించి, చిన్న వయసులోనే డైరీ వ్యాపార రంగంలోకి వచ్చి, డైరీ సంస్థ నిర్వహిస్తూ, 
గుంటూరు జిల్లా లో ఇతర పారిశ్రామిక వేత్తలకు అవగాహనా సైతం కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురం లో 10 ఎకరాల్లో గ్రాసం పెంచుతూ, ముర్రా జాతి గేదెలను

పెంచుతు, రోజుకు పాలు విక్రయిస్తూ, స్థానికులకు ఈ డైరీ అందుబాటులో ఉంటోంది.  

5 ముర్రా జాతి గేదెల తో మొదలు వ్యాపారం పెట్టిన పవన్, ప్రస్తుతం 50 గేదెల వరకూ డైరీ ని అభివృద్ధి చేసారు. అత్యంత శ్రద్ధతో డైరీ లోని పశు సంపదను పరిరక్షిస్తూ వ్యాపారాభివృద్ధి చెందించారు. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చిన దూడలను

కొనుగోలు చేసి, ప్రత్యేక వైద్య పర్యవేక్షణతో మేలు రకం గేదెలు గా తయారు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విక్రయిస్తుంటారు. 

ఒక ప్రక్క వ్యాపార వ్యవహాలతో పాటు. జిల్లాలోని గ్రామగ్రామాన పర్యటించి, ఆర్తులకు అండగా నిలుస్తున్నారు. పాఠశాలల పిల్లలకు పుస్తకాలూ, వృద్ధాశ్రమాలకు వస్త్రాలు, ఆలయాల్లోని అర్చకులు,

పురోహితులకు అండగా నిలుస్తున్న పవన్ కుమార్ వయసు కేవలం మూడు పదులే కావడం గమనార్హం. 

రాజకీయ అభిలాషతో గత దశాబ్ద కాలంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, అందరికి తల లో నాలుకలా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే గుంటూరు కేంద్రంగా  ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి లక్ష్యంతో

వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

తెలుగుదేశం సీనియర్ నాయకులూ, పార్టీ లో అత్యంత కీలయమైన భాద్యతలు నిర్వహిస్తున్న టిడి జనార్దన్ సూచనల మేరకు తెలుగుదేశం లో చేరుతున్నట్టు పవన్ కుమార్ తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam