DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటీటీ వెబ్‌లకు సెన్సార్‌ తప్పని సరి చేయాలి: కన్సూమర్‌ ఫెడరేషన్‌

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 24, 2023 (DNS Online ):* 
సృజనాత్మకత ముసుగులో ఓటీటీ వేదికల్లో ప్రసారమయ్యే వెబ్‌ సిరీసులకు సెన్సార్‌ తప్పనిసరి చేయాలని వినియోగదారుల సంఘాల సమాఖ్య (కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌) రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకట రమణ డిమాండ్‌ చేశారు. ఓటీటీ కొన్ని

వెబ్‌ సిరీసుల్లో మితిమీరుతున్న అశ్లీలత, ధోరణులపై 2021లో ‘నిబంధనలైతే కచ్చితంగా ఉండాలి’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరదని, అదే విధంగా తగిన చట్టం, మార్గదర్శకాలను రూపొందించాలని దిల్లీ హైకోర్టు సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నేటికీ పూర్తి స్ధాయిలో చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా అసాంఘిక

వెబ్‌ సిరీసుల నియంత్రణకు తక్షణం ప్రత్యేక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వ శాఖకు శుక్రవారం సోషల్‌ మీడియా  వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమాలు ఉధృతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని ఆయన హెచ్చరించారు. సెన్సార్‌ విధానమే లేని ఓటీటీ ప్రసారాల్లో అసభ్యత శ్రుతిమించి స్వైరవిహారం

చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల్లో అసభ్య పదజాల వినియోగాన్ని తీవ్రంగా పరిగణించాలని, ప్రసారానికి ముందు వెబ్‌సిరీసులను అధికార వర్గాలు పరిశీలించాలన్నారు.  

ప్రస్తుతం రోజుకు సగటున 70 నిమిషాలు ఓటీటీ వేదికలను వీక్షిస్తున్నారని, భారతీయ వినోద విపణిలో ఓటీటీల వాటా 7 నుంచి 9 శాతంకు

పెరిగిందన్నారు. 2018లో ఓటీటీ వేదికలు భారతదేశంలో సుమారు రూ. 2,600 కోట్లు ఆర్జించగా 2023 డిసెంబర్‌ నాటికి రూ. 12 వేల కోట్లుకు చేరుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 43 కోట్ల మంది ఓటీటీలను చూస్తుంటే అందులో దాదాపు 12 కోట్ల మంది సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించి వీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. వీక్షకుల్లో

అత్యధిక శాతం యువత కావడంతో వాళ్లను ఆకట్టుకోవడానికి కొంతమంది దర్శక, నిర్మాతలు అశ్లీలం, మాదక ద్రవ్యాల సేవనం, మద్యపానం, హింసాత్మక దృశ్యాలతో చాలా వెబ్‌సిరీసులను చిత్రీకరిస్తూ నటీనటులతో బూతు సంభాషణలను విచ్చలవిడిగా పలికిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దుశ్చర్యలు యువతపై ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటీటీల్లో ప్రసారమయ్యే అభ్యంతరకర అంశాలపై రెండేళ్ల క్రితం ఏర్పాటైన మూడంచెల విధానం పూర్తిగా విఫలమైందని, కాబట్టి తక్షణం సమర్ధ విధానాలను అమలు చేయాలని కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam