DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఏఎస్ ల భారత్ దర్శన్ పోటీ లో టాప్ తూగో జిల్లా జేసీ తేజ్ భరత్

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 25, 2023 (DNS Online ):* ప్రతి ఏడాది ఐఎఎస్ లకు ప్రేరణ కలిగించే దిశలో ముస్సోరి లో 45 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శిక్షణ పూర్తి చేసిన తర్వాత నిర్వహించే వ్రాత పరీక్షలో  మరియు  "భారత్ దర్శన్" అంశంపై  గ్రూప్ ప్రెజెంటేషన్‌ రెండు విభాగాల్లో

 ప్రతిభ కనబరిచి  మొదటి బహుమతి సాధించిన జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత  డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు  పదోన్నతి పొందిన అధికారులకు

 పబ్లిక్ పాలసీ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ ఆధ్వర్యంలో  లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA), ముస్సోరి, ఉత్తరాఖండ్ నందు ఏర్పాటు చేయబడిన 124వ పౌర సేవా శిక్షణ / ప్రేరణ శిక్షణ తరగతులకు   జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్  10.02.2023 నుండి 24.03.2023 (45 రోజుల) శిక్షణకు హజరవ్వడం

జరిగింది.

 ఎల్బిఎస్ఎన్ఎఏ , ముస్సోరి వారు నిర్వహించిన శిక్షణలో భాగంగా శిక్షణ అనంతరం నిర్వహించే పోటీ పరీక్షల్లో 139 మంది పాల్గొనగా వారిలో  జేసీ తేజ్ భరత్ ప్రథమ స్థానం దక్కించు కోవడం జరిగింది.  అదే విధంగా  "భారత దర్శనం" పై   పరీక్షకు  శిక్షణకు  హాజరైన 139 ఐ.ఎ.ఎస్ లు వ్రాయడం జరిగింది.  అందులో చక్కటి

ప్రతిభ చూపి " భారత దర్శనం" అను  అంశంపై చక్కటి ప్రెజెంటేషన్ ప్రదర్శన ఇచ్చుట ద్వారా  124 వ ప్రేరణ తరగతి బ్యాచ్ లోనే ప్రధమ స్దానంలో నిలవడం లో గ్రూప్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి అవార్డును  సాధించినట్లు తేజ్ భరత్ తెలిపారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తన ప్రతిభను చాటుకొని, ప్రథమ స్థానం సాధించిన

సందర్భంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, డిఆర్వో జీ. నరసింహం, ఇతర రెవెన్యూ, జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలియ చేశారు.

పురస్కార వేదికపై ముఖ్య అతిథి  డిఓపిటి మాజీ కార్యదర్శి అజయ్ మిట్టల్, ఎల్ బి ఎస్ ఎన్ ఎ ఎ ప్రత్యేక సంచాలకురాలు రాధికా రస్తోగి, ల నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్వీకరించారు. ఎల్

బిఎస్ఎన్ఎ  ప్రత్యేక సంచాలకులు శ్రీనివాస్ ఆర్. కటికితల పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam