DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైళ్లు పోతున్నా  భాజపా ఎంపీకి పట్టింపు లేదా 

విశాఖపట్నం, ఆగస్టు 15 ,2018 (DNS Online) : విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయమంటూ దశాబ్దాల నుంచి ఉత్తరాంధ్రా వాసులు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోని

కేంద్ర ప్రభుత్వం ( రైల్వే శాఖ) పట్టించుకోని విషయం దేశమంతా తెలిసిందే. అయితే  à°°à±ˆà°²à±à°µà±‡ శాఖ ఇంతకూ మించిన ద్రోహం విశాఖ ప్రజలకు చేసేందుకు సిద్దపడింది. విశాఖ నుంచి

రాకపోకలు సాగించే ప్రధాన రైళ్లల్లో చాలా వాటిని ( విశాఖ ఎక్స్ ప్రెస్, ప్రశాంతి  à°Žà°•à±à°¸à± ప్రెస్ లాంటివి ) ఎన్నో ఏళ్ళ క్రితం   భువనేశ్వర్ పట్టుకు పోయారు. ఇప్పుడు మరో

కొన్ని రైళ్లను భువనేశ్వర్ కు పట్టుకు పోయేందుకు భారతీయ రైల్వే శాఖ రంగం సిద్ధం చేసేసింది. వీటిలో ఉత్తరాంధ్రా వాసులకు అత్యంత ఆవశ్యకమైన సింహాద్రి ఎక్స్

ప్రెస్ ( విశాఖపట్నం నుంచి గుంటూరు ), మరో గరీబ్ రథ్ రైలు ను భువనేశ్వర్ కు తరలిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసేసుకుంది. దీంతో విశాఖ వాసులకు ఉన్న ఈ

మాత్రం రైళ్లు కూడా దూరమైపోయే అవకాశం ఉంది. దీనిపై ఏ ఒక్క రాజకీయ పార్టీ నేతగానీ,  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధులు గానీ ఇంతవరకూ నోరెత్తక పోవడంతో ఉత్తరాంధ్రా వాసులు

మండిపడుతున్నారు. పైగా విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు డాక్టర్ కె. హరిబాబు కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ కి చెందినవాడు కావడం గమనార్హం. ఈయన విశాఖకు

సహాయం చెయ్యమని నోరు విడిచి ఏనాడూ  à°•à±‡à°‚ద్రాన్ని à°…à°¡à°¿à°—à°¿à°¨ పాపాన పోలేదు అని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినా, పట్టించుకునే తీరిక à°ˆ ఎంపీ గారికి ఉండదేమో

 à°†à°¯à°¨à°•à±‡ తెలియాలి. ఈయన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని హామీలు ఇచ్చే, 2014  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ ఈయన ప్రచారం చేసుకున్నారు. à°“à°¡ దాటే వరకూ.. à°’à°• మాట, దాటాక మరొక మాట లాగా ఉంది à°ˆ

ప్రజాప్రతినిధుల తీరు. రైల్వే జోన్ ఎప్పుడు ఇస్తారో వాళ్ళకే తెలియదు కానీ, ఉన్న రైళ్లను భువనేశ్వర్ కు తరలించుకు పొతే రానున్న ఎన్నికల్లో పార్టీకి ఉత్తరాంధ్ర లో

పుట్టగతులు మాత్రం ఉండవన్నది వాస్తవంగానే కనపడుతోంది.
 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #trains  #simhadri express #indian railways #trains

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam