DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు డిసెంబర్ లోనే జరుగనున్నాయా? 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 30, 2023 (డిఎన్ఎస్  DNS Online ):* ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్నా ఊహాగానాలకు పేరుకొంటున్న తరుణంలో హస్తిన నుంచి వెలువడుతున్న సంకేతాలు ఈ ఊహలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు

కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎప్పుడు ప్రకటన వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పడికే తెలంగాణ లో డిసెంబర్ లో ఎన్నికలు జరగవలసి ఉండగా, అదే ముహూర్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నిర్వహించేందుకు హస్తిన అగ్రనేతలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల రెండు వరాల

నిడివి లోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేయడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రస్తుతానికి లభించిన సమాచారం ప్రకారం డిసెంబర్ 15 , 2023 న తెలంగాణా తో పాటు ఆంధ్రప్రదేశ్ లోను ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 18.. న మొదలు కావచ్చు అని హస్తిన

వేగుల నుంచి సమాచారం లభిస్తోంది. నామినేషన్ ఉపసంహారణ కు గడువు తేది నవంబర్ 28 కావచ్చు. ఎన్నికలు డిసెంబర్ 15, 2023  న నిర్వహించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 19 ,2023 న జరిపేందుకు సమాయత్తం అవుతున్నట్టు హస్తిన లో వార్తలు జోరందుకుంటున్నాయి. డిసెంబర్ 23 న ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో విజయం సాధించిన వారు ముఖ్యమంత్రి గా ప్రమాణ

స్వీకారం చేయడం జరుగుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 
అయితే ఈ తేదీలు కొంచెం అటు లేదా ఇటు ఉండవచ్చు, కానీ కచ్చితంగా ఈ 2023 సంవత్సరంలో తెలంగాణా తో పాటుగా ఆంధ్ర కు కూడా ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam