DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిజం డిప్లొమా కోర్సు ను సద్వినియోగం చేసుకోవాలి 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 31, 2023 (డిఎన్ఎస్):* పాత్రికేయ వృత్తి ఎంతో నిబద్దత కలిగి సమాజంలో ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం లో చురుకైన పాత్ర పోషించదగినిదిగా ఉండాలని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, సినిమాఆటోగ్రాఫి శాఖా మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ,

ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు లు ఆశాభావం వ్యక్తం చేశారు.

శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సి.రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో  "జర్నలిజం లో డిప్లొమా కోర్సు" కు సంబందించి నోటిఫికేషన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ

మాట్లాడుతూ, విలువలతో కూడిన జర్నలిజం కోసం పట్టణ - గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడం, జర్నలిజంలో విద్యార్హత కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేయడం లో భాగంగా జర్నలిజం లో డిప్లొమా కోర్సు ను రూపొందించి ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని అన్నారు. జర్నలిజం లో డిప్లొమా కోర్సు" ను ఈ

సంవత్సరం (2023) నుంచి ప్రారంభించడం జరుగుతోందని, జర్నలిజం కరెస్పాండెన్స్ విధానంలో (ఆన్ లైన్) క్లాసులు నిర్వహణ చెయ్యడం జరుగుతుందని అన్నారు..
నిరంతర విద్యార్థిగా ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ అధ్యయనం చేయాలి.  ముఖ్యంగా సమాజంలో గౌరవించే విధంగా జర్నలిస్ట్ ల పాత్ర ఉండాలని కోరారు. సమాజానికి మేలు చేసే విధంగా పాత్రికేయులు సమాజ

హితం కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. చరిత్రలో చెరపరానిది  జర్నలిజం పాత్ర అనడంలో ఎటు వంటి సందేహం లేదని, వారి నుంచి విలువలతో కూడి  వ్యవహరించాలని మంత్రి సూచించారు.

చైతన్య సమాజ నిర్మాణం కోసం పాటు పడిన కందుకూరి వీరేశలింగం పంతులు పుట్టిన గడ్డ పై ఈ కోర్సు కి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా అరుదైన సందర్భం,

తనకు దక్కిన అదృష్టంగా మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు, వాస్తవాలు ప్రజలకు తెలియ చెయ్యడం పాత్రికేయులు చాలా కీలకమైన పాత్ర పోషించాలని, విలువలతో కూడిన జర్నలిజం విధానం అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. 

జర్నలిస్ట్ లతో పాటు, జర్నలిజం పై ఆసక్తి ఉన్న యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కోసం జర్నలిజం డిప్లొమా కోర్సు

ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి అన్నారు. 

జర్నలిస్టులకు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పై మంత్రి: 

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ 8699 మంది జర్నలిస్టులు, వారి కి చెందిన ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందచేశామని మంత్రి సిహెచ్. వేణుగోపాల్ అన్నారు. తద్వారా వారిపై ఆధారపడిన 26,700 మంది కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత ప్రయోజనం

చేకూరుస్తున్నాం అని తెలిపారు. వైద్య పరంగా జర్నలిస్టు లు, వారి కుటుంబ సభ్యులకు  210 విభాగాల్లో వైద్య సేవలు అందించడం వలన  రు. 2.70 కోట్లు మేర చెల్లింపులు చెయ్యడం ద్వారా సుమారు 2700 మంది లబ్ది పొందినట్లు తెలిపారు. జర్నలిస్ట్ ల కోసం ప్రత్యేకంగా కోర్ ఆపరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి

వివరించారు.

సి రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో  "జర్నలిజం లో డిప్లొమా కోర్సు" కై  నాగార్జున యూనివర్సిటీస్ తో ఒప్పందం చేసుకున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్  కొమ్మినేని శ్రీనివాసరావు 
పేర్కొన్నారు. నేటి నుంచి  ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో దరఖాస్తుల

స్వీకరణ 
చేస్తున్నామని ప్రకటించారు.  https://pressacademy.ap.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.దరఖాస్తు చేసుకునేందుకు  చివరి తేదీ: 15.04, 2023 గా పేర్కొన్నారు. జర్నలిజం వృత్తి చాలా ఛాలెంజ్ తో కూడిన వృత్తి అని పేర్కొన్నారు. జర్నలిస్టులకు రూ. 1500/-,  జర్నలిజం పట్ల అభిరుచి కలిగిన ఇతరులకు  రూ. 2000/- ఫీజ్ గా

నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  ప్రెస్ సెక్రటరీ, ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పేరే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలని కోరారు..జర్నలిస్టులకు  ఇంటర్మీడియేట్, ఇతరులకు డిగ్రీ కనీస విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు ఏ ఆర్ వి సత్యనారాయణ మూర్తిని, చిరుకూరి

సాయి బాబా లను మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు లు పుష్పగుచ్చాన్ని అందించి దుశ్యాలువాతో సత్కరించారు.

కారక్రమంలో ఎపి ప్రెస్ అకాడమీ ఏకడామిక్ డైరెక్టర్ ఎల్. వి కృష్ణా రెడ్డి, కార్యదర్శి బాల గంగాధర్ తిలక్, ఓ ఎస్ డి.. ఎస్. శ్రీనివాస్ జీవన్,

రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎమ్. శ్రీరామమూర్తి, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్ధ సారధి, గౌరవ పాత్రికేయులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam