DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవీఎల్ చొరవతో విశాఖ నుంచి ఎయిర్ కార్గో సేవలు పునరుద్ధరణ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 11, 2023 (డిఎన్ఎస్ ):* ఈ నెల ఒకటో తేదీ నుండి విశాఖపట్నం - విజయవాడ ఎయిర్పోర్ట్ ల నుండి  కార్గో ఎగుమతి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో అనేక మంది ఎగుమతిదారుల వాణిజ్య వ్యవహారాలు పూర్తిగా స్తంభించి పోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆక్వా

రంగానికి చెందిన వాణిజ్య వేత్తలు తీవ్ర ఇబ్బందులకు గురవ్వడం జరిగింది..

ఈ విషయం తెలిసిన వెంటనే బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ఎగుమతి దారులు మరియు విశాఖ ఎయిర్ పోర్టు అధికారులతో సంప్రదించి కార్గో రవాణా ఆగిపోవడానికి గల కారణాలను సమీక్షించడం జరిగింది.. కొన్ని భధ్రతా కారణాల ధృష్యా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన

బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS   గత కొద్ది కాలం క్రితం కొత్త నిబంధనలను నిర్దేశించిన నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తిందని తెలియ వచ్చింది

వెంటనే గత రెండు రోజులుగా ఎంపి జీవీఎల్  కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ అధికారులతోనూ మరియు DG-BCAS , DG - ఎయిర్పోర్ట్ అధారిటీ కార్గో లాజిస్టిక్స్ (AAICLAS)లతో సంప్రదిస్తూ

వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టులలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడలలో తలెత్తిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.

ఎంపీ జీవీఎల్ చొరవతో BCAS ఇచ్చిన ప్రత్యేక అనుమతులకు లోబడి ఏపీలోని ఎయిర్పోర్ట్ లకు ఇండిగో ఎయిర్ లైన్స్ ద్వారా కార్గో  సేవలను పునరుద్ధరించే  విధంగా ఉన్నతాధికారులు నిర్ణయం

తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అథారిటీ (AAICLAS) మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ కుమార్ వెంటనే ఇండిగో యాజమాన్యంతో సంప్రదించి త్వరలో కార్గో సేవలను పునరుద్ధరించే విధంగా నిర్ణయించగా ఈ విషయాన్ని స్వయంగా సివిల్ ఏవియేషన్ అధికారులే ఈరోజు ఎంపీ జీవీఎల్ కి తెలియ చేసి కార్గో సేవలను త్వరలో పునరుద్ధరిస్తామని తెలియ

చేశారు.

దీనిపై జీవీఎల్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించే ఆక్వారంగం మాత్రమే కాక ఇతర ఎగుమతులకు ఎటువంటి ఆటంకం ఎదురైన తాను పరిష్కారానికి కృషి చేస్తానని, దీనిపై ఎటువంటి సహాయానికైనా  ఎగుమతిదారులు తనను సంప్రదించవచ్చని తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam