DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రోడ్డు ప్రమాదం గురికాకుండా గోవుల కొమ్ములకు రిఫ్లక్టివ్ స్టికర్లు 

*కాకినాడ హనుమాన్ దళ్ బృందం సేవకు సర్వత్రా ప్రశంసలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 12, 2023 (డిఎన్ఎస్ ):* రాత్రి వేళల్లో రహదారులపై విశ్రాంతి తీసుకునే గోమాతలు తరుచుగా వాహనాలు ఢీ కొట్టడం వలన  రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిని ఆసుపత్రికి తరలించే లోగానే కొన్ని

మరణిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు చూసిన కాకినాడ హనుమాన్ దళ్ బృందం ఒక బృహత్తర కార్యక్తమం చేపట్టింది. రోడ్డు పై ఉన్న ప్రతి గోవు కొమ్ములకు రిఫ్లక్టివ్ స్టికర్లు అంటించారు. తద్వారా రోడ్డు పై తిరిగే వాహనాలకు ఈ గోవులు సుస్పష్టంగా కనపడతాయి. 

ఈ నెల 7 వ తేదీ రాత్రి కాకినాడ జగన్నాధపురం వంతెన సమీపంలో గుర్తు తెలియని

వాహనం ఢీకొట్టడంతో గోవు మరణించింది. అటుగా వెళ్తున్న హనుమాన్ దళ్ అధ్యక్షులు గణేష్ కన్నా మరణించిన గోవును చూసి చలించిపోయారు. కాకినాడ సిటీలో రోడ్ల మీద వందల సంఖ్యలో గోవులు ఉన్నాయ్ ఇలా తెలియకుండా ఎన్నో గోవులు ప్రమాదాలు బారిన పడుతున్నాయి అని గ్రహించి గోవులను రక్షించే బాధ్యత హనుమాన్ దళ్ సంస్థ తీసుకుంటుంది అని

కార్యకర్తలకు తెలియజేశారు.

   గోవులను రక్షించే బాధ్యతని హనుమాన్ దళ్ తీసుకుంటుందని ప్రకటించిన కొన్ని క్షణాలకి రాత్రికి రాత్రి సిటీలో రోడ్ల మీద ఉన్న గోవులను గుర్తించి వాటి కొమ్ములకి రిఫ్లక్టివ్ స్టికర్లు అంటించారు. గోవులు రోడ్ మీద వెళ్ళేటప్పుడు వాహనాలు లైటింగ్ కి గోవు కొమ్ములకి ఉన్న రిఫ్లెక్టివ్

స్టికర్లు ఉండటంతో డ్రైవర్ అప్రమత్తం అయ్యి గోవు ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది.హనుమాన్ దళ్ అధ్యక్షులు గణేష్ కన్నా తో పాటు కోశాధికారి శివకుమార్ ఉప కోశాధికారి సురేష్ కుమార్ గోవులకు రిఫ్లెక్టివ్ స్టికర్లు అంటించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam