DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదివారం రాజమండ్రి రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి రిపేర్ల కోసం మూసివేత 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, ఏప్రిల్ 13, 2023 (డిఎన్ఎస్  DNS Online ):* రాజమహేంద్రవరం - కొవ్వూరు లను కలుపుతున్న రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై హ్యాండ్ రైల్, ఫుట్ పాత్ ల మరమత్తులు నిమిత్తం ఏప్రిల్ 16 ఆదివారం రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6

గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై ఏ విధమైన వాహనములు అనుమతించ బడవని బ్రిడ్జి పై రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.
రైల్వే, ఆర్ అండ్ బి అధికారుల ప్రతిపాదన మేరకు రోడ్ కం రైల్ వంతెన హ్యాండ్ రైలింగ్, పుట్ పాత్ పనులకు సంబంధించి ప్రతిపాదించిన 20 పనులలో 10 పనులను మార్చి 26 న చేపట్టడం

జరిగిందన్నారు. మిగిలిన పది పనులను చేపట్టేందుకు రోడ్ ట్రాఫిక్ ను నివారించేందుకు ఆర్ అండ్ బి, రైల్వే అధికారుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 16 వ తేదీ ఆదివారం జరుగుతాయన్నారు. ఈ సమయంలో బ్రిడ్జి పై ఏ విధమైన వాహనములు అనుమతించ బడవని, ట్రాఫిక్ ఆ సమయంలో మళ్ళిచడం జరుగుతుందని  కలెక్టర్ ప్రజలకు తెలియ చేశారు. ఈ విషయంపై జిల్లా

యంత్రాంగానికి, పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకి ప్రజలు సహకరించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam