DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ బస్సులు 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 25, 2023 (డిఎన్ఎస్ ):* హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తుల సౌకర్యం కోసం విశాఖపట్నం నగర బస్ కాంప్లెక్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ద్వారకా బస్ స్టేషన్ నుంచి బయలు దేరి కాణిపాకం, శ్రీపురం గోల్డెన్

టెంపుల్, అరుణాచలం, కంచి, కాళహస్తి పుణ్యక్షేత్రాలను దర్శించే విధంగా రూట్ సిద్ధం చేసారు. ఒక్కో టికెట్ ధర సూపర్ లక్సరీ బస్సు కు రూ. 4000 గాను, ఇంద్ర ఏసీ బస్సుకు రూ. 5000 గాను నిర్ణయించారు.  

తమిళనాడు లోని తిరువణ్ణామలై క్షేత్రంలోగల ఈ అరుణగిరి ని ప్రతి పౌర్ణమి రోజున వేలాదిగా భక్తులు ప్రదక్షిణం ( గిరివాలం) చేయడం

జరుగుతుంది. దీనికోసం ఆంధ్ర ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అదికాక సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. వీళ్ల సౌకర్యం కోసం ప్రతి నెలా బస్సులు నడపనున్నారు. దీనిలో భాగంగా ఈ వైశాఖ మాసం లో వచ్చే పౌర్ణమి రోజు (మే 5 , 2023 శుక్రవారం ) నాడు జరిగే  గిరి ప్రదక్షిణ కోసం మే 3 , 2023 న విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి మొదటి

బస్సు బయలు దేరుతుంది. ఇతర పుణ్యక్షేత్రాలు దర్శించిన అనంతరం మే 7 , 2023 న తిరిగి విశాఖ చేరుతుంది. 

ఈ యాత్ర టికెట్లును ఆర్టీసీ వెబ్సైటు ద్వారా కొనుగోలు చేసే సదుపాయం ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam