DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి మహాసంప్రోక్షణ సేవలో తరించిన ఘంటాపాణి 

తిరుమల, ఆగస్టు 16, 2018 (DNS Online) : తిరుమల శ్రీనివాసుని ఆనంద నిలయం లో 12 ఏళ్లకోసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం లో అర్చక శ్రేష్ఠుల

నుంచి సహాయక పరిచారగణం సైతం తరించారు.  à°ˆ ఘంటను మ్రోగించడం à°…à°‚à°¤ సామాన్యమైన విషయం కాదు. ఏకకాలంలో రెండు ఘంటలనూ ఒకే సారి ఏకంగా గంటన్నర సమయం మ్రోగించడం అందరినీ

ఆశ్చర్యపరిచింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఘంటాపాణి రవి గురువారం నాడు సళ్లింపు, నివేదన సమయంలో ఒకటిన్నర గంటపాటు నిర్విరామంగా ఈ రెండు భారీగంటలను మోగించి

స్వామిపట్ల తన భక్తిప్రపత్తులను చాటుకున్నాడు. ఎంతో ఏకాగ్రతతో గంటలను మోగించిన రవిని అర్చక, అధికారగణం అభినందించారు. మహాసంప్రోక్షణ సందర్భంగా బంగారు వాకిలి

చెంత నిర్వహించిన సళ్లింపు, శుద్ధి, నివేదన సమయాల్లో గంటానాదం, డోలు నాదస్వరం విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  à°šà±†à°¨à±à°¨à±ˆà°•à°¿ చెందిన నాదస్వర, డోలు విద్వాంసులు

విద్వాన్‌ శ్రీ ఎంకెఎస్‌.శివ, శ్రీఎంకెఎస్‌.నటరాజన్‌ వాద్య విన్యాసం వినసొంపుగా సాగింది. à°ˆ సందర్భంగా వారు నాగవరాళి, త్యాగరాజ కీర్తనలు, పిబరే రామరసం…, వేంకటాచల

నిలయం…. తదితర కీర్తనలను వీనులవిందుగా తమ వాయిద్యాల్లో పలికించారు.


ఘంటా మండపం : 

శ్రీవారి ఆనంద నిలయంలో బంగారు వాకిలి ఉన్న మండపాన్ని మహామణి మండపం

లేదా గంటా మండపం అంటారు. ఇందులో నాలుగు వరుసల్లో మొత్తం 16 స్తంభాలుంటాయి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మంత్రి శ్రీ మల్లన్న 1417వ సంవత్సరంలో దీనిని

నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ నరసింహ, శ్రీ వరాహ, శ్రీ మహావిష్ణు, శ్రీ వరదరాజస్వామివారి ప్రతిమలున్నాయి.

సుప్రభాత పఠనం, కొలువు, పంచాంగ శ్రవణం, ఆదాయ వ్యయ నివేదన తదితరాలతోపాటు సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవలు ఈ మండపంలోనే జరుగుతాయి. దీనిని ఆస్థానమండపం అని కూడా

అంటారు. ఉగాది, దీపావళి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, ఆణివార ఆస్థానం తదితర పర్వదినాలను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ మండపంలో దక్షిణం వైపున రెండు గంటలున్నాయి.

నైవేద్య నివేదన సమయంలో ఒక గంట పాటు ఈ రెండు భారీగంటలను మోగిస్తారు. ఈ కారణంగా దీన్ని తిరుమామణి మండపం అని అంటారు.

 

 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #ttd  #tirumala  #tirupati  #temple 

#ghantanadam  #ghanta

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam