DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీవీ 9,ఎన్టీవీ లూ మీ స్థాయి ఏంటో చూపిస్తా: చంద్రబాబు వార్నింగ్  

*(DNS Report: P. Raja, Bureau Chief,  Amaravati)*

Amaravati, మే 05, 2023 ( DNS Online):* తాము అధికారంలోకి వచ్చిన తదుపరి  గతి తప్పిన టీవీ 9 , ఎన్ టి వి ఛానెళ్లూ మీ స్థాయి ఏంటో చూపిస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేరుగా అయన

ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తటస్తంగా ఉండవలసిన మీడియా పూర్తిగా గతి తప్పి ప్రతిపక్ష పార్టీలపై అవాకులు చెవాకులు ప్రసారం  చేస్తున్నాయని మండిపడ్డారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు అయన రాజమండ్రి వచ్చారు. ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న చిట్

ఫండ్ వ్యాపారం నిర్వహణ లో ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా. . అక్రమంగా ఆమె భర్త శ్రీనివాస్, మామ అప్పారావును అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టారు. ఈ సందర్బంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ. . .టీవీ 9, ఎన్ టి వి మీడియా ఛానెళ్ల కు అయన వార్నింగ్ ఇచ్చారు. జరిగిన ఘటనలను యధాతధంగా వాస్తవాలతో చూపించవలసిన మీడియా ప్రతిపక్ష

పార్టీలను దోషులుగా చూపిస్తూ ఏకపక్ష కథనాలు చూపిస్తోందన్నారు. ఇదే  విషయాన్నీ మీడియా సమయంలోవే నేరుగా చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సమావేశంలో చంద్రబాబు తో పాటు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కే అచ్చ్చంనాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam