DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యాగానికి కరపత్రాల నుంచి గుళ్లకు కోటా విధించారు: ధార్మిక సంఘాలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మే 05, 2023 ( DNS Online):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈ నెల 12 నుంచి 17 వరకూ విజయవాడ లో జరుగుతున్నా చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యాగం కోసం ప్రతి రూపాయి కోసం దేవాలయాలకు కోటా విధించేశారని హిందూ ధార్మిక సంఘాలు

మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా దేవాలయాలకు ఇవ్వని ప్రభుత్వం, ప్రజలు  హుండీల్లో వేసిన మొక్కుబడులు ను ఇలా ఖర్చు చెయ్యడం ఏంటని ధార్మిక ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.  
యాగం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో జరుగుతోందని చెప్తున్నా. .ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల

చెయ్యడం లేదన్నారు. కరపత్రాల నుంచి పూర్ణాహుతి వరకూ ప్రతి రూపాయి రాష్ట్రంలోని దేవాలయాలకు కోటా విధించేశారని ఆవేదన చెందారు. . ఆలయం స్థాయిని బట్టి వాటికి నిధులు ఎంత ఇవ్వాలి, కరపత్రాలు ఎన్ని పంచాలి, గోడ పత్రికలూ, హోర్డింగ్ లు, బ్యానర్లు, ఫ్లెక్సీ లు కూడా ఏ దేవాలయం ఎన్ని ఇవ్వాలి అనే లెక్కలను రాష్ట్ర దేవాదాయ శాఖా కమిషనర్

పేరిట అధికారిక ప్రకటన విడుదల చేసారు. దీని ప్రకారం ఆర్జీసీ, డీసీ క్యాడర్ దేవాలయాలకు  కరపత్రాలు 5000, గోడ పత్రికలూ 2000, హోర్డింగ్ లు 10, బ్యానర్లు 50, ఫ్లెక్సీ లు 50 ఇవ్వాలని ఆదేశించారని తెలిపాయి.  ఇక ఏసీ స్థాయి, గ్రేడ్ 1, 2, 3 స్థాయి దేవాలయాలు కరపత్రాలు 2000, గోడ పత్రికలూ 1000, హోర్డింగ్ లు 5, బ్యానర్లు 20, ఫ్లెక్సీ లు 25 ఇవ్వాలని

ఆదేశించారన్నారు. 
ఇవి కాకుండా మిగిలిన ఖర్చులకు ఒక్కో దేవాలయం నుంచి 5 లక్షల రూపాయల నుంచి 30 లక్షల వరకూ నిధులు ఇవ్వాలని ఆదేశించారన్నారు. బస్సులను కూడా ప్రధాన gulla నుంచి విజయవాడకు తరలిస్తున్నారన్నారు.  

గతంలో ఏ దేవాలయ పరిధిలో వాళ్ళు ప్రత్యేక యాగాలు చేయడం జరిగేదని, తద్వారా ప్రతి సుఖేత్రంలోను భక్తులు నేరుగా

పాల్గొని, భాగస్వాములు అయ్యేవారన్నారు. తద్వారా ఖర్చులు పరిధిలోనే జరిగేవన్నారు. నేడు అన్ని గుళ్ళలోనూ నిలిపి అందరిని విజయవాడలోనే ఆహ్వానించి చేయడం ద్వారా వ్యవయం అధికం అవ్వడంతో పాటు, స్థానిక దేవాలయాలకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోతోందన్నారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam