DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 2 న సింహగిరి ప్రదక్షిణ కు పటిష్ట ఏర్పాట్లు: ట్రస్టీ గంట్ల

3 న ఆషాఢ పౌర్ణమి, మూడవ విడత చందన సమర్పణ 

(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)    

విశాఖపట్నం, జూన్  01, 2023 ( DNS Online): ఈ ఏడాది జులై 2 వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ, ఆషాఢ పౌర్ణమి రద్దీ కి అనుగుణంగా సింహాచల క్షేత్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం

ధర్మకర్త మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం  జరిగిన ట్రస్ట్ సభ్యుల సమావేశంలో గిరి ప్రదక్షిణ, ఆషాఢ పౌర్ణమి వేడుకల ఏర్పాట్లపై చర్చించామన్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం లో జరిగే  అత్యంత ప్రసిద్ధమైన ఉత్సవాల్లో గిరి ప్రదక్షిణ

ఒకటి. ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున లక్షలాది మంది భక్తులు 32 కిలో మీటర్ల సింహాచల క్షేత్రం గిరి పరిక్రమణ చేయడం జరుగుతుందన్నారు. 

ఈ ఏడాది జులై 2 వ తేదీన ఈ యాత్ర జరుగనుంది. తదుపరి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున స్వామి సింహాచల వాసునికి మూడవ విడత 3 మణుగుల చందాన సమర్పణ జరుగుతుంది. ఈ రెండు వేడుకలో  వరుసగా రావడంతో ఆలయ

పరిసరాల్లో భక్తులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆలయ కమిటీ సమావేశం జరిపిందని తెలిపారు. 
గిరి ప్రదక్షిణ కోసం శ్రీ స్వామివారి పుష్పరధం, సిద్ధం చేయడం, ప్రధాన దేవాలయం ప్రత్యేక పుష్పాలంకరణలు రథం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు, కొండ చుట్టూ స్టాల్స్ ఏర్పాటు జీవీఎంసీ వారిచే శానిటైజర్ మరియు వాటర్ సరఫరా గురించి విద్యుత్

సరఫరా గురించి పుష్పక రథము తిరుగు మార్గంలో సర్వీస్ వైర్లు తొలగించడం గురించి  మరియు వాల్ పోస్టర్స్ ప్రభుత్వ శాఖల వారికి లేఖల వ్రాయుట మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయుట పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతా కోసం డ్రోన్ ఏర్పాట్లు,  తదితర అంశాలు చర్చించారు. 

ఈ సమావేశంలో ఈఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam