DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 14 న అన్నవరం నుంచి వారాహి జైత్ర యాత్ర కు శ్రీకారం

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూన్  02, 2023 ( DNS Online):* దేశ రాజకీయాల్లో సంచలనం గా మారిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రధం వారాహి ఈ నెల 14 న అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి జైత్రయాత్ర కు శ్రీకారం చుట్టనుంది. 
శుక్రవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన

విలేకరుల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్ర వివరాలను ప్రకటించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం చేసుకుని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం అన్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుంది.

కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాదు. ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు ఉండేలా ప్రణాళిక తయారు చేసుకున్నాం అన్నారు. 
11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి

జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. 
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. ప్రతి

నియోజక వర్గంలో వారాహి నుంచి ప్రజలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారన్నారు.

* వినతులు స్వీకరిస్తూ... క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ...
ప్రజల సమస్యలు వింటూ, వాటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ యాత్ర సాగేలా ప్రణాళిక ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు

ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతారు. 

ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, పాలకుల కళ్లు తెరిపించేలా, సమస్యకు పరిష్కారం చూపేలా గళమెత్తుతారు. కచ్చితంగా వచ్చే జనసేన ప్రభుత్వంలో సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో కూడా ప్రజలకు

భరోసానిస్తారు. 

* ప్రతి నియోజక వర్గంలో జన వాణి

పొత్తులలో భాగంగా ఖరారు అయిన యాత్ర కాదిది... అన్నీ నియోజకవర్గాల్లోనూ వారాహి యాత్ర ఉండాలనేది పవన్ కళ్యాణ్ అభిమతం అన్నారు. ఈ యాత్ర ఎన్నికల కోసమో, పొత్తులో ఖరారైన నియోజక వర్గాల్లోనో సాగే యాత్ర కాదు. అన్ని నియోజక వర్గాల్లో సమస్యలను, ప్రజలను ప్రత్యక్షంగా

తెలుసుకునేందుకు, కలుసుకునేందుకు చేస్తున్న యాత్ర. ప్రతి నియోజక వర్గంలో జన వాణి కార్యక్రమం ఉంటుందన్నారు.  

పోలీసులకు జనసేన పార్టీ ఎల్లపుడూ సహకరిస్తుంది. వారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవం. వారు కూడా మాకు యాత్రలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం’’ అన్నారు. 

అంతకు ముందు యాత్ర

ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam