DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకేశ్ పై గుడ్లు విసరడం హేయమైన చర్య : పాతర్ల రమేష్

*(DNS Report: P. Raja, Bureau Chief, Amaravati)* 

*Amaravati, June 3, 2023 (DNS Online) :* రాష్ట్ర వ్యాప్తంగా లోకేశ్ పాదయాత్రకు వస్తు్న్న ప్రజాదరణను చూసి లోకేశ్ యువగళం పాదయాత్రపై పోలీసులచే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని.. వైసీపీ లోని కొందరు లోకేశ్ పై కోడిగుడ్లు విసరడం హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్

మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ఎవరూ భయపడేవారు లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ పేర్కొన్నారు. 

    అమరావతిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే వైసీపీ నాయకులకు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు. ప్రొద్దుటూరులో యువగళం

పాదయాత్రలో లోకేశ్ పై కోడిగుడ్లు విసిరి భయపెడితే చూస్తూ ఊరుకోమన్నారు. సందపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సమర్థుడు చంద్రబాబే అన్నారు. రాజకీయ ఉన్మాదంతో విర్రవీగుతున్న వైసీపీ నాయకులు కొందరు అధికారులను తమ ప్రభుత్వం వచ్చాక భరతం పడతామన్నారు. దాడికి ప్రతిదాడి చేయడానికి మేమూ సిద్ధమన్నారు. ఇకమీదట

లోకేశ్ పై ఇలాంటి దాడులు చేస్తే జగన్ దే బాధ్యత అన్నారు. లోకేశ్ పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకొని బాధ్యతులను శిక్షించాలన్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసరుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకు డీజీపీ బాధ్యత వహించాలి.
 సంపదను సృష్టంచి రాష్ట్రాన్ని

అభివృద్ధి చేయగల సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడేనన్నారు. జగన్ ప్రజావేదికను కూల్చేయడంతోనే జగన్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు భూములిస్తే ఆ భూములు పంచడమనేది తగదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజల గ్రహించారన్నారు. జగన్ నాలుగు ఏళ్ల  పాలనలో లో రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదన్నారు. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని.. ఇది అక్షరాల నిజమని తెలిపారు. సంపదను సృష్టంచి రాష్ట్రాన్ని

అభివృద్ధి చేయగల సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబేనన్నారు. చంద్రబాబునాయుడును విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. త్వరలో వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతారన్నారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గ్రహించారని ఈ సందర్భంగా పాతర్ల రమేష్ వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam