DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా శ్రావణ మాస తొలి శుక్రవారం పూజలు 

విశాఖపట్నం, ఆగస్టు 17 ,2018 (DNS Online): ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మావారి ఆలయం లో శ్రావణ మాసోత్సవాలు అత్యంత శాస్త్రోక్తంగా, ప్రారంభవడంతో ఆలయ

ప్రాంగణంతో సహా పరిసర వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం తొలిశుక్రవారం కావడం తో అమ్మవారికి ఉదయం క్షీరాభి షేక సేవ ఉదయం 7 గంటలకు

ప్రారంభమైంది, à°ˆ సేవలో సుమారు 12  à°®à°‚ది ఉభయదారులు పాల్గొన్నారు.  à°…నంతరం 40 మంది భక్తులచే శ్రావణ మాసం సందర్బంగా తొలి లక్ష్మి పూజలను ప్రారంభించారు. ఆలయ అర్చకులు,

వేదపండితులు ఆయనను ఆలయ మండపంలో ఆశీర్వచనం చేశారు.

శ్రావణ మాస ఉత్సవ ఏర్పాట్లు ప్రత్యేకం : ఈఓ మాధవి.

ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ జె మాధవి

మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మి పూజలను భక్తులచే నిర్వహింపచేస్తున్నామని, వేలాది మంది భక్తులు నెలరోజుల పాటు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి

ఆశీస్సులు అందుకుంటున్నారన్నారు. రెండు విడతలుగా జరిగిన తొలి శుక్రవారం పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మరి కొంతమంది భక్తులకు

పోస్టల్ ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని పంపుతున్నట్టు వివరించారు. ఈ నెల12 నుంచి సెప్టెంబర్ 9 వరకూ శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని

ఏర్పాట్లు చేశామన్నారు.

పూజలో పాల్గొనే భక్తులకు... :

ఈ పూజలు ఈ శ్రావణ మాసం అంతా జరుగుతాయని, ఒక టిక్కెట్టు రూ. 400 మాత్రమే నని, పూజా సామాగ్రి దేవస్థానమే

సమకూరుస్తుందన్నారు. పాల్గొన్న భక్తులకు శేవస్త్రం ( కండువా), జాకెట్టు, రాగి యంత్రం, పులిహోర, చెక్కెర పొంగలి ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.

పూజల సమయ

వేళలు :

ఈ ప్రత్యేక పూజలు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ శ్రావణ మాసమంతా జరుగుతాయన్నారు. అయితే అమ్మవారికి అత్యంత ప్రియమైన గురువారం, శుక్రవారాల్లో

రెండు విడతలుగా జరుపుతామని, మొదటి విడత ఉదయం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ జరుగుతుందని, రెండవ విడత ఉదయం 9 :30 గంటల నుంచి 10 : 30 గంటల వరకూ నిర్వహిస్తామన్నారు.ఈ పూజల్లో

పాల్గొన్న భక్తులు పూజ అనంతరం అక్కడే ఆలయ ప్రాంగణం లో ప్రతి రోజు జరిగే లక్ష్మి హోమం ను దర్శించుకుని, హోమ గుండం చుట్టూ ప్రదర్శన చేసి అమ్మవారి దర్శనం అనంతరం

ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ మాసోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బృందావనం

దేశికాచార్యులు, ఆలయ వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sri kanaka mahalakshmi temple  #skml temple  #sravana masam  #sravana shukravaram  #puja 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam