DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయకీలాద్రి పై అహోబల జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష స్వీకారం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం/ విజయవాడ, జులై 03, 2023 ( DNS Online):* ఆషాఢ పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి సోమవారం చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేసారు. విజయవాడ సమీపంలోని సీతానగరం లో గల విజయ కీలాద్రి దివ్యక్షేత్రంలో (చిన్న జీయర్

స్వామి వారి వేదపాఠశాల దరి ) వేద పండితులు, ఆగమ ఆచార్యుల నిర్వహణలో శాస్త్రోక్తంగా దీక్ష స్వీకారం చేసారు. తమ ఆచార్యులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి అనుగ్రహం తో, వారి ఆదేశం మేరకు ఈ ఏడాది చాతుర్మాస్య దీక్ష విజయ కీలాద్రి లో నిర్వహిస్తున్నట్టు  స్వామి  తెలియచేసారు. 
అనంతరం గురు పూర్ణిమ

 మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సూక్త హవనం, లక్ష్మీ హయగ్రీవ హవనం, తదుపరి శ్రీ  సీతా రామచంద్రుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం తమ ఆచార్యులైన చిన్న జీయర్ స్వామివారి పాదుకారాధన చేపట్టారు. 
ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు సీతారాముల నిత్యా కళ్యాణం, శ్రీయాగం, సహస్ర దీపాలంకరణ, జీయర్ స్వామి వారి ప్రవచనం

అందించనున్నారు. 

దీక్ష సమయంలో ఆయా పరిసరాల్లోని దేవాలయాలు, పాఠశాలలు, గ్రామా paryatanalu నిర్వహించనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam