DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొట్టు పెట్టుకున్న హిందూ బాలిక పై టీచర్ చెంపదెబ్బ, బాలిక ఆత్మహత్య 

*ఝార్ఖండ్ జేవియర్ స్కూల్లో క్రైస్తవ మతోన్మాద టీచర్ల ఆగడాలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 11, 2023 ( DNS Online):* పాఠశాలకు నుదుటన బొట్టు పెట్టుకుని వచ్చిన ఓ హిందూ బాలిక పై టీచర్ చెయ్యి చేసుకుని ఘోరంగా అవమానించిన ఘటనలో బాలిక ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం గా మారింది. ఝార్ఖండ్ లోని

ధన్‌బాద్‌లోని టెతుల్‌మారీ ప్రాంతంలోని సెయింట్ జేవియర్స్ పాఠశాల ఉపాధ్యాయుడు నుదుట న బిందీ పెట్టుకుని పాఠశాలకు వచ్చినందుకు ఒక హిందూ విద్యార్థిని మొత్తం తరగతి చూస్తుండగా కొట్టారు. ఈ ఘటనపై ఆరా తీసేందుకు విద్యార్థిని తల్లి పాఠశాలకు రాగా, ప్రధానోపాధ్యాయుడు ఆమెను అవమానించి పాఠశాల నుంచి వెళ్లగొట్టాడు. దీంతో

అవమానంగా భావించిన విద్యార్థి ఇంటికి తిరిగి వచ్చి ఉరి వేసుకుంది. జూలై 10వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పూర్వాపరాలను బాలిక సూసైడ్ నోట్‌ లో వ్రాసింది.

దీంతో స్థానిక ప్రజలు పాఠశాల భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. ఘటనకు ప్రధాన కారణమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు

చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషన్‌ విచారణ చేపట్టింది.

పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజ్‌కిషోర్‌ సింగ్‌, టీచర్‌ సింధు ఝాలను అరెస్టు చేశారు

జూలై 10న తేతుల్మారి పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదిక (నంబర్–33/2023) నమోదైంది. నిందితులపై IPC సెక్షన్లు 306 (ఆత్మహత్యకు

ప్రేరేపణ) మరియు 34 (సాధారణ ఉద్దేశ్యంతో పలువురు వ్యక్తులు చేసిన చర్యలు) కింద కేసు నమోదు చేశారు.

అత్యంత పాశవికంగా ఈ ఘటనకు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జార్కండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబుల్‌కల్‌ మరాండీ తక్షణం ఈ పాఠశాలకు ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని జార్కండ్‌ ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. ఇలాంటి

పాశవిక చర్యలకు ఇకపై ఇంకెవ్వరూ పాల్పడ కుండా వీరిద్దరి కఠిన శిక్షలు అమలు చెయ్యాలని డిమాండ్ చేసారు. 

అయితే ఈ ఘటన పట్ల మీడియా వర్గాలు పెద్దగా స్పందించక పోవడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam