DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుటుంబం కోసం కూలి, తన ఆశయ సాధన కోసం కెమిస్ట్రీ లో పీహెచ్ డి చేసింది

*అనంతపురం సాక్షిగా ఒక పేద మహిళ భారతి స్ఫూర్తిదాయక గాథ*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*అనంతపురం / విశాఖపట్నం, జులై 18, 2023 ( DNS Online):* మట్టిలో మాణిక్యాలు ఎక్కడో ఉండవు. రోజూ మనం చూసే వ్యక్తుల్లోనే ఉంటాయి అనడానికి అనంతపురం మహిళ భారతే ప్రత్యక్ష నిదర్శనం. కుటుంబం రోజు గడవం కూడా అతి కష్టం లో ఉండడంతో

దినసరి వేతనం పై రోజు కూలి పనికి వెళ్తున్న సాకె భారతి శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నుంచి రసాయన శాస్త్రం లో పీహెచ్ డి పట్టా పొందింది. సోమవారం జరిగిన విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ సభలో రాష్ట్ర గవర్నర్ అహ్మద్ చేతుల  సాక్షిగా ఈమె పట్టా అందుకుంది.    

విద్యాలయం సభ నిర్వాహకులు ఈమె పేరు చదవగానే

 పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురు తో కలిసి వచ్చింది భారతి.  
కాళ్లకు పారగాన్‌ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లోనూ ఒకటే ఆశ్చర్యం. 

పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని ఋజువు చేస్తూ నడిచి వస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి

అబ్బుర పడిపోయారు. అయినా సరే, ఆమెలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. యావత్ సభ ప్రాంగణం ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. 

ఊరి చివర ఒక షెడ్ లో నివాసం:..

అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. ఆ ఊరి చివర ఓ చిన్న రేకుల షెడ్డు ఈమె నివాసం.

ఆదివారం ఈ ఇంటి ముందు పెద్ద ఎత్తున జనాలు చేరుకున్నారు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, మరింత సంతోషం. ఎందుకా అని ఆరాతీస్తే నిత్యం తమతో పాటు కూలి పనులకొచ్చే భారతి డాక్టర్‌ అయ్యిందని సంబరపడిపోతున్నారు కొందరు. 

ఎటువంటి కోచింగ్‌లూ, అదనపు తరగతుల సాయం లేకుండా రసాయన శాస్త్రాన్ని ఔపోసన ఎలా పట్టిందని

ఆశ్చర్యపోతున్నారు మరికొందరు. 

విద్యా పయనం:...

చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనుకునేది భారతి. పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో పూర్తిచేసింది. 

తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి

బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో తనకి పెళ్లి చేశారు. 
భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా...ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. 
భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే.

అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని దినాలు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. 
అప్పటికే తనకో కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ

పట్టేది. 

కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. 
ఇన్ని కష్టాల మధ్యా భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి భర్త, టీచర్లూ పీహెచ్‌డీ

దిశగా ఆలోచించమన్నారు. ప్రయత్నిస్తే ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు. 

డాక్టరేట్‌ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది.

నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది... 

*Courtesy : Sarathchandra Yakkali*
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam