DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల చేరిక ఎవరికీ బలాన్ని ఇస్తుంది?

*జులై 20 న 400 కార్లు, 20 బస్సులతో భారీ ర్యాలీగా బెజవాడకు*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 18, 2023 ( DNS Online):* మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరడానికి ఈ నెల  20 న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇన్నాళ్లు అధికార పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఈయన ఇటీవలే తన పదవికి,

పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న జనసేన పార్టీలో ఈయన చేరడం పట్ల ఎవరికీ లాభం చేకూరుతుంది అనే అంశం పై పలు చర్చలు జరుగుతున్నాయి. 
జూలై 20 న 400 కార్లు, 20బస్సులతో 20వ తారీఖున భారీ ర్యాలీగా విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్లి   విజయవాడ వెళ్లి జనసేన పార్టీలో అధ్యక్షులు

పవన్ కళ్యాణ్ ద్వారా చేరనున్నారు. 

అధికార పార్టీ నుంచి బయటకు రావడం అంటే సాహసమనే చెప్పాలి. జనసేన కు కార్యకర్తల మద్దతు ఉంది  గానీ, జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే నాయకులూ పెద్దగా లేకపోవడం గమనార్హం. పంచకర్ల చేరికతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ లోటు కొంతవరకూ తీరనుంది అని చెప్పాలి. ఈయనకు గతంలో ఎమ్మెల్యే గా

చేసిన అనుభవంతో పాటు, స్థానికంగా భారీ క్యాడర్ కూడా ఉండడం అదనపు బలంగా చెప్పవచ్చు. 

ఈయనకు విశాఖ జిల్లా పెందుర్తి నుంచి గానీ, యలమంచిలి నుంచి గానీ శాసన సభకు పోటీలో నిలిపే అవకాశం ఉంది. 

పార్టీకి పెద్దగా నాయకులూ లేని కారణంగా పంచకర్ల చేరిక జనసేనకు బలం అవుతుందని కొందరు, అధికార పార్టీలో పెద్దగా

గుర్తింపు లేని కారణంగా పార్టీ మారుతుండడంతో అవకాశం కల్పిస్తున్న జనసేన పార్టీయే పంచకర్ల కు  బలం అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

వివాదరహితునిగా ఇన్నాళ్లు పేరుపొందిన పంచకర్ల ఏ పార్టీలో చేరినా, ఇతర పార్టీల నుంచి పెద్దగా విమర్శలు  వచ్చే అవకాశాలు తక్కువ.

అయితే విశాఖ నగర పరిధిలో ఉండే

పెందుర్తి నియోజక వర్గం నుంచి శాసన సభకు నుంచి పోటీ చేసేందుకే పంచకర్ల ఆసక్తిగా ఉన్నట్టు గతంలోనే ప్రకటించారు. 

కొసమెరుపు: వైకాపాలో ఉండగా కేవలం తిరుమల దర్శనం టికెట్లు తప్ప ఇంకేమి లబ్ది పొందలేదన్నారు .
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam