DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దక్షిణాది పై దృష్టి సారించిన మోడీ, రామనాథపురం లోక్ సభకు పోటీ ? 

*ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ద్రావిడ సింహం అన్నామలై పాదయాత్ర* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 26, 2023 ( DNS Online):* రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలో చివరి ప్రాంతమైన రామనాథపురం (  రామేశ్వరం ) నుంచి లోక్ సభ  సీటుకు  పోటీలో నిలిచేందుకు భారత ప్రధాన నరేంద్ర మోడీ

ఆలోచన చేస్తున్నారు అనే అంశం తమిళనాట పెను దుమారం రేపుతోంది.  
 
ప్రపంచ దేశాల్లో అందరిని ఆకట్టుకోగలిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాదిలో సైతం గెలిచేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న విజయవంతం కాలేకపోతున్నారు. కనీసం ప్రాతినిధ్యం కూడా చట్టసభల్లో లేకపోవడం మోడీ లో పట్టుదల పెంచింది అనే ఢిల్లీ వర్గాలు

తెలియచేస్తున్నాయి. ఇప్పడికే బీజేపీ చేతిలో ఉన్న కర్ణాటక చేజారిపోయింది. అసాధ్యాన్ని సాధ్యం చెయ్యడం ఒక్కటే తీసిన మోడీ బృందం దక్షిణ భారతాన్ని మోడీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. అందుకే మోడీ ప్రయోగించిన మిసైల్ కె అన్నామలై.  

తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షునిగా

అన్నామలై నియామకం జరిగింది. పార్టీని బలోపేతం చెయ్యడం కోసం చేసిన ఈ ప్రయోగం అద్భుతంగా సాగింది. మోడీ తనకి ఇచ్చిన టార్గెట్ ను అన్నామలై పూర్తి చేసే దిశగా సాగుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఫినిషింగ్ టచ్ గా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. 

ఈ నెల 28 న టెంపుల్ సిటీ గా ఖ్యాతిగాంచిన

రామేశ్వరం నుంచి తమిళనాట పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఎన్ మన్ ఎన్ మక్కల్ పేరుతొ  జరుగుతున్నా ఈ యాత్రను  జనవరి 11 న చెన్నై లో ముగుస్తుంది. 

దీన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానుండడం వీళ్ళ టాస్క్ లో భాగమే.

ఇంతకాలం బీజేపీ ని దూరం పెట్టిన దక్షిణ భారత దేశంలో స్వయంగా తానే పోటీ లో

నిలిచి తానూ  కేవలం ఉత్తరాది కి మాత్రమే  రాజు ను కాదని, దక్షిణాది లో కూడా గెలవగలను అని నిరూపించేందుకు రామనాథపురం నుంచి లోక్ సభ కు పోటీ చేయనున్నట్టు ఢిల్లీ వర్గాల అభిప్రాయం. 
ఇదే గనక జరిగితే తమిళనాట బీజేపీ విస్తృతంగా పాగా వేసే అవకాశం ఉంది. అందుకే ఇటీవల మోడీ tamilanadu కు bhaaree వర్గాల jhallu kuripincharu. 

ఈ సీటు కు

ప్రస్తుతం ముస్లిం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తీవ్రమైన పోటీ ఇచ్చారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam