DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణ బండి చేతికి భాజపా జాతీయ కళ్ళాలు కట్టారు. 

*టుకడే  గ్యాంగ్ కి తక్ థినా ధీన్నె: బండి సంజయ్ అభిమానులు*

*ప్రధాని సూచనతోనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి నియామకం?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 29, 2023 ( DNS Online):* దక్షిణాది లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్నసంచలన నిర్ణయాల్లో ఒకటి తమిళనాడు బీజేపీ

కి అధ్యక్షునిగా మాజీ ఐపిఎస్   అన్నామలై ను చేయగా, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ ను నియమించడం  రెండో దశ గా అభివర్ణించవచ్చు. 

తెలంగాణ లోని కరీంనగర్ లోక్ సభ సభ్యునిగా ఉన్న బండి ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు.

తెలంగాణ లో చతికిల పడిన పార్టీని

గదిలో పెట్టి, అధికార, ప్రతిపక్ష పార్టీలకు నిద్ర లేకుండా చేసిన  ఘనత బండి సంజయ్ కె దక్కుతుంది. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారానికి చేరువ అవుతోంది అని అందరూ భావిస్తున్న తరుణంలో అధ్యక్షుని స్థానం నుంచి బండి ని తప్పించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే జాతీయ స్థాయి లో పార్టీకి కరడు కట్టిన హిందుత్వ నేతలు

నాయకత్వం వహించవలసి ఉన్నట్టుగా అధిష్ఠానం భావించింది. దీంతో బండి సంజయ్ ను తొలుత కేంద్ర కార్యవర్గంలోకి తీసుకుంది. శనివారం  ఏకంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధికార ఉత్తర్వులు విడుదల చేసింది. 

 త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ దేశ వ్యాప్తంగా

హిందుత్వ విధానాన్నిపాటిస్తాం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు బండి సంజయ్ 
ను ప్రధాన కార్యదర్శి గా నియమించినట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్, కరీంనగర్ ల్లో జరిగిన అన్ని సభల్లోనూ జన సమీకరణ చూసి నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యపోవడం మీడియా పరంగా అందరూ చూసారు.  

ఇటీవల 26 ప్రతిపక్ష పార్టీలతో

 ఏర్పడిన కూటమిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో బలమైన కమిటీతో సిద్ధం చేస్తున్నారు. 

దీనిలో భాగంగానే  భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ నియమించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam