DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వారాహి యాత్ర లో మంత్రాంగానికి - యంత్రాంగానికి సై

*వారాహిని అడుగుపెట్టనివ్వకుండా అనకాపల్లి నుంచే ఆంక్షల సెక్షన్ లు సిద్ధం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఆగస్టు 06, 2023 ( DNS Online):* ఈ నెల 10 నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  వారాహి యాత్ర సంచలనం సృష్టించనుంది. జన సేనాని మంత్రాంగం నడుపుతుంటే. . .అధికార పార్టీ యంత్రాంగాన్ని

వాడుతోంది. ఈ యాత్ర ను విశాఖ జిల్లా పరిధి లోకే అడుగుపెట్టనివ్వకుండా చెయ్యాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనికి కావాల్సని అన్ని అస్త్రాలను వినియోగిస్తోంది.  
గత ఏడాది కూడా జన సేనాని  విశాఖ పర్యటనను అధికార పార్టీ  పోలీస్ యంత్రాంగం సెక్షన్ 30 పేరుతొ అడ్డగోలుగా

అడ్డుకుంది. ఒకే రోజు ఉదయం అధికార పార్టీ ర్యాలీలకు అమలులో లేని సెక్షన్ 30 అదే రోజు సాయంత్రం పవన్ యాత్ర కు విచక్షణ లేకుండా అడ్డంకులు కల్పించడమే కాకుండా, బస చేసిన గది లోనే పవన్ ను మూడు రోజులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ పర్యాయం కచ్చితంగా విశాఖ లో వారాహి యాత్ర చేసి తీరతామని, దీన్ని జాతీయ స్థాయి లో ద్రుష్టి పడేలా

చేసేందుకు పవన్ బృందం సర్వ సన్నద్ధం అవుతోంది. అయితే ఇప్పడికే పోలీసులు సెక్షన్ 30 ను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 
వారాహి ని అసలు ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్డు పైకి రానివ్వను అని మీడియా ముఖంగా ప్రకటించిన ఐటి శాఖా మంత్రి గుడివాడ అమర్ నాధ్ నియోజక వర్గంలోనే యాత్ర జరిపేందుకు పవన్ సిద్ద పడడంతో ఇరు

వర్గాలు పట్టుదలకు వెళ్లిపోయాయి. 

రెండు విడతల వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన జరిపితే. . మూడో విడత కేవలం విశాఖ నగర పరిసరాలకు పరిమితం చేసి, గుడివాడ గట్టి సవాల్ విసిరారు. 

ఇప్పడికే రాజకీయ రంగస్థలంలో కేతిగాడి పాత్ర లాంటి వాళ్లతో ప్రెస్ మీట్ లు సైతం నిర్వహించి, జనసైనికులను మానసికంగా

దెబ్బతీసే ప్రయత్నం చేసింది పాలక పక్షం. 

యాత్ర జరిగితే జనసేనాని వచ్చే ఫలితం కంటే అధికార యంత్రాంగం ఈ యాత్ర ను అడ్డుకుంటే. . .వచ్చే ఫలితం పదింతలు ఉంటుంది. గతంలో విశాఖ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి లో ఉండే పవన్ కళ్యాణ్ నేడు జాతీయ స్థాయిలో ఏకంగా ఎన్ డి ఏ కూటమి సమావేశాల్లోనే ఆహ్వానితులు అయ్యారు. విశాఖ లో యాత్రను

మరొక సారి అడ్డుకుంటే ఈ సారి ఎన్ డి ఏ కూటమికి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam