DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 13 న విశాఖ లో డాలర్ శేషాద్రి పేరిట పిల్లలకు శ్లోకాల పోటీలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఆగస్టు 12, 2023 (DNS Online):* ‘విశాఖ లో టిటిడి  కల్యాణ మండపం లో జరుగుతున్న శ్రీవారి సంగీత ఉత్సవాల్లో ఈ నెల 13 న డాలర్ శేషాద్రి జ్ఞాపకార్ధం విద్యార్థిని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించనున్నట్టు కార్తీకదీపోత్సవ కమిటీ ప్రతినిధి హిమాంశు ప్రసాద్ తెలియచేసారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తి గీతాలు, భగవద్గీత శ్లోకాలు, డ్రాయింగ్, రామాయణ, భారతం అంశాలలో పోటీలు నిర్వహించబడుతున్నాయన్నారు. విశాఖపట్నం ఎంవిపి కొలని గల టీటీడీ కళ్యాణమండపం లో ఏర్పాటు చేసిన విచారణ కేంద్రం వద్ద పేర్లు  నమోదు చేయించుకోవాలన్నారు. 

పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి

సర్టిఫికెట్. డాలర్ శేషాద్రి జ్ఞాపకార్థం ఒక మెడల్ డాలర్. ఒక ఆధ్యాత్మిక పుస్తకం ఇవ్వడం జరుగుతుందన్నారు. పోటీలో ప్రతిభ కనబరిచిన మొదటి, రెండవ, మూడవ బహుమతులు ప్రత్యేక బహుమతులు అందిస్తున్నామన్నారు. 

విశాఖ ప్రాంతంలోని చిన్నారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకి పాత్రులు కావాలని

ఆహ్వానిస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam