DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ జెఏసి ఏర్పాటు కోసం విశాఖ బ్రాహ్మణ సంఘాల సమావేశం

*అందరిని ఒక వేదిక పైకి చేర్చే ప్రయత్నం: కె సుబ్రహ్మణ్యం* 

*బ్రాహ్మణ బజార్ పేరిట ఎగ్జిబిషన్ మేళా: డిఎన్ఎస్ శాయి*  

*వ్యాపార సేవలో రాయితీలు అందిస్తాం..: పరిమి నాగేంద్ర*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఆగస్టు 13, 2023 (DNS Online):* మహా విశాఖ నగరం లోని బ్రాహ్మణులూ

ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై అన్ని బ్రాహ్మణ శాఖల సంఘాల ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఆదివారం విశాఖ లోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో సుమారు 10 సంఘాల ప్రతినిధులు, పాత్రికీయ సంఘాలు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సుమారు 70 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని 98 వార్డులు, భీమిలి,

అనకాపల్లి, తగరపువలస పెందుర్తి, గాజువాక తదితర ప్రాంతాల్లో 2 లక్షల 40 వేల మంది బ్రాహ్మణులూ అధికారికంగా లెక్కల ప్రకారం ఉన్నట్టు తెలుస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుంటూ వెళ్లే విధంగా కార్యాచరణ చేపట విధంగా ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జె ఏ సి) ను ఏర్పాటు చేయాలని సూచించారు. అభిప్రాయ భేదాలు ప్రక్కన పెట్టి,

అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 

అందరిని ఒక వేదిక పైకి చేర్చే ప్రయత్నం: కె సుబ్రహ్మణ్యం 

సమన్వయ కమిటీ సభ్యులు కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తోలి సన్నాహక సమావేశం మాత్రమేనని, నియోజక వర్గాల వారీగా మరిన్ని సమావేశాలు నిర్వహించి, అన్ని ప్రాంతాల వారిని ఒక వేదిక పైకి చేర్చడం

జరుగుతుందన్నారు. 

బ్రాహ్మణ బజార్ పేరిట ఎగ్జిబిషన్ మేళా: డిఎన్ఎస్  

సమన్వయ కమిటీ సభ్యులు శాయిరామ్ సివిఎస్ మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో చిన్న స్థాయిల్లో వ్యాపారం  చేసే వారికి, దేవాలయాల నిర్వహణ చేసేవారికి ప్రోత్సాహం కల్పించేందుకు తమ డిఎన్ఎస్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. అతి

త్వరలోనే బ్రాహ్మణ బజార్ పేరిట ఎగ్జిబిషన్ మేళా నిర్వహిస్తామని, దీని ద్వారా బ్రాహ్మణులూ తయారు చేస్తున్న ఉత్పత్తులను మేళ ద్వారా ప్రజలను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఈ మేళా నెలకోసారి నిర్వహిస్తామని, తద్వారా బ్రాహ్మణులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. 

వ్యాపార సేవలో రాయితీలు అందిస్తాం..: పరిమి

నాగేంద్ర  

వ్యాపార ప్రతినిధి పరిమి నాగేంద్ర మాట్లాడుతూ వ్యాపార వర్గాలతో సమన్వయము చేసుకుని, బ్రాహ్మణులకు తగిన రాయితీలతో కూడిన సేవలు అందిస్తామన్నారు. బ్రాహ్మణ బజార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. 

విద్య, వైద్యం సదుపాయం కల్పిద్దాం: కావూరి చరణ్ 

వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్

సొసైటీ అధ్యక్షులు కావూరి చరణ్ కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణులకు వైద్యం, విద్య రంగాల్లో అవసరమైన సదుపాయం కల్పించే ఏర్పాటు చేద్దామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఒక బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేసుకుని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా నిర్వహించుకోవాలన్నారు.  


వార్డు స్థాయిలో బ్రాహ్మణ కుటుంబాల సర్వే: వంగూరి

గణేష్ 

సమన్వయ కమిటీ సభ్యులు వంగూరి గణేష్ శాయిరామ్ సివిఎస్ ట్లాడుతూ త్వరలోనే వార్డు స్థాయిలో సర్వే ప్రారంభించి, బ్రాహ్మణ సామజిక ప్రతినిధులను గుర్తించి, వారికీ ఓటు నమోదు చేయించడం జరుగుతుందన్నారు. వారి సమస్యలను తెలుసుకుని జె ఏ సి హెల్ప్  లైన్ కు నెంబర్ కు తెలియచేయడం జరుగుతుందన్నారు. 

అన్ని

వృత్తుల వారిని గుర్తించాలి: వడ్డాది ఉదయ్ 

పెందుర్తి బ్రాహ్మణ సంఘం ప్రతినిధి, పాత్రికీయులు వడ్డాది ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణులూ అంటే కేవలం అర్చకులు, పురోహితులు మాత్రమే అనే భ్రమలో సమాజం ఉందన్నారు. అయితే బ్రాహ్మణుల్లో ఇతర వృత్తులు కూడా చేసేవారు ఉన్నారని వారిని కూడా గుర్తించాలన్నారు. 



సమావేశంలో విశాఖ బ్రాహ్మణ పురోహిత సంఘాల ప్రతినిధులు పూడి పెద్ది శర్మ మాట్లాడుతూ సింహాచలం ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబాల ప్రతినిధులను సమీకరించి వారిని ఏకత్రాటిపైకి తీసుకువస్తామన్నారు.  

విశాఖ ఆరువేల నియోగుల బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. కోటేశ్వర రావు మాట్లాడుతూ వారిమెరక జుత్తాడ గ్రామంలో

బ్రాహ్మణుల కోసం మూడు అంతస్తుల  బ్రాహ్మణ భవనం నిర్మించామని తెలిపారు. ఇక్కడ కేవలం అపార క్రియలు చేసుకునే సదుపాయం ఉందన్నారు. అన్ని శాఖల బ్రాహ్మణులకు ఈ భవనం అందుబాటులో ఉందన్నారు.    

కార్యక్రమం లో ఉత్తరాంధ్ర అర్చక సంఘం సంయుక్త కార్యదర్శి, కొత్తలంక మురళీకృష్ణ, విశాఖపట్నం బ్రాహ్మణ  పాత్రికీయ సంఘం

ప్రతినిధులు  వి. శ్రీనివాస రావు, టీవీ ఎన్ ప్రసాద్, సూర్య భగవాన్, శివ గణేష్, బాలభాను అర్చక, పురోహిత సంఘం ప్రతినిధులు కామేశ్వర శర్మ, ఎం. ఉదయ్ కుమార్, వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి శంకర్ నీలు, ఆర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam